Tagoor : ఠాగూర్ ఫార్మా పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
ఫార్మసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గని శెట్టి డిమాండ్.
జయభేరి, పరవాడ:
పరవాడ ఠాగూర్ ఫార్మా పరిశ్రమలో గత నెల 26న గ్యాస్ లీకైన ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందడానికి, 30 మంది ఆసుపత్రిలో చికిత్స పొందడానికి కారణమైన యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు గని శెట్టి సత్యనారాయణ బుధవారం పరవాడలో స్థానిక విలేకరులతో గనిశెట్టి మాట్లాడుతూ డిమాండ్ చేశారు.
ప్రమాదాల విశ్లేషణ, రిస్కీ మేనేజ్మెంట్ కి ఏర్పాట్లు లేవు, లామి వుడెన్ తయారీపై అధ్యయనం చేయలేదు, ప్రాంగణంలో సేఫ్టీ రిలీఫ్ వాల్వోలు లేవు, రియాక్టర్లకు స్క్రబ్బింగ్ సిస్టం లేదు, రబ్బర్ డిస్క్ల ఆనవాళ్లు లేవు, వాయువులు విడుదలైనప్పుడు డిటెక్టర్లు అలారం సిస్టం లేదు ఈ లోపాలన్నీ ఉన్నప్పటికీ యాజమాన్యం విషయాన్ని గోప్యంగా ఉంచి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని కార్మిక శాఖ మంత్రి ఘటన స్థలానికి రాకుండా బాధ్యత లేకుండా వ్యవహరించారని ఇలాంటి ప్రమాదాలు కారణమైన యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని యాజమాన్యం అరెస్టు చేయాలని గని శెట్టి డిమాండ్ చేశారు.
Post Comment