AARA Exit Poll: కుప్పంలో వైసీపీ ప్లాన్ రివర్స్.. ఆరా సర్వేలో సంచలనం..

ఈ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధిస్తుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో అడ్డాలో చంద్రబాబు నాయుడు వైసిపి జెండా ఎగురవేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. అసలు ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. అంతకంటే ముందే ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి.

AARA Exit Poll: కుప్పంలో వైసీపీ ప్లాన్ రివర్స్.. ఆరా సర్వేలో సంచలనం..

ఈ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధిస్తుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో అడ్డాలో చంద్రబాబు నాయుడు వైసిపి జెండా ఎగురవేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. అసలు ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి. అంతకంటే ముందే ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన సర్వే సంస్థల ప్రకారం కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో గెలుస్తారని పలు సర్వే సంస్థలు జోస్యం చెప్పాయి. ముఖ్యంగా వైసీపీకి అనుకూలంగా సర్వేలు చేయిస్తున్నారని ఆరా సంస్థపై కొన్ని విమర్శలు ఉన్నాయి. అలాంటి ఆరా సంస్థ కూడా కుప్పంలో టీడీపీ అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గెలుస్తారని జోస్యం చెప్పారు. ఔరా ఆర్గనైజేషన్ హెడ్ మస్తాన్ పోస్ట్ పోల్ సర్వే అంచనాలను వెల్లడించారు. చంద్రబాబు భారీ మెజార్టీతో గెలుస్తారని మస్తాన్ అన్నారు.

కుప్పం మీద వైసీపీ ఆశలు..
వై నాట్ 175 నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన వైసీపీ కుంపంలో చంద్రబాబు నాయుడును ఓడించేందుకు అనేక కుట్రలు పన్నినట్లు ఆరోపణలు వస్తున్నాయి.రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు వైసీపీ భారీ ప్రచారం చేసింది. ముఖ్యంగా పిఠాపురం, కుప్పం నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబులను ఓడించడమే లక్ష్యంగా వైసిపి యోచిస్తోంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీ వ్యూహాలు ఫలించలేదని తెలుస్తోంది. పిఠాపురం, కుప్పం నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోవడం ఖాయమని ఆరా సంస్థ అంచనా వేస్తోంది. పిఠాపురంలో జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్, కుప్పంలో టీడీపీ అభ్యర్థి చంద్రబాబు నాయుడు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని అర మస్తాన్ జోస్యం చెప్పారు.

Read More వరద బాధితుల సహాయార్థం సేకరించిన విరాళాలు 

Social Links

Related Posts

Post Comment