బైక్‌పై వచ్చి సెల్‌ఫోన్ తీసుకొని ఉడాయించడానికి యత్నించిన ఇద్దరు ఆగంతకులు
నంబర్ ప్లేట్ లేని ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు అడ్రస్ అడుగుతున్నట్లు నటించారు. జాషువాకుమార్ దగ్గరికి వచ్చి సెల్‌ఫోన్ ఇస్తే ఒక ఫోన్ చేసుకుని ఇస్తామని అడిగారు. అతడు వారి చేతికి ఫోన్ ఇవ్వగానే ఉడాయించడానికి యత్నించారు.
జయభేరి, యూసుఫ్‌గూడ:
బైక్‌పై వచ్చి సెల్‌ఫోన్ తీసుకొని ఉడాయించడానికి యత్నించిన ఇద్దరు ఆగంతకులను ఓ యువకుడు ధైర్య సాహసాలతో పట్టుకున్నాడు.
అప్రమత్తమైన జాషువా.. వారి బైక్ కీని లాక్కున్నాడు. ఆగంతకులు అతడిని కత్తి తీసి బెదిరించి, దాడి చేయడానికి యత్నించారు. అయినా జాషువా కుమార్ భయపడకుండా ఒక స్నాచర్‌ను పట్టుకోగా కత్తితో దాడి చేశాడు. ఈక్రమంలో బాధితుడు గట్టిగా అరవడంతో హాస్టల్ నుంచి బయటికి వచ్చిన యువకులు ఆగంతకులను పట్టుకుని 100కు డయల్ చేశారు. మధురానగర్ పోలీసులు వచ్చి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జాషువా కుమార్ సాహసాన్ని స్థానికులు ప్రశంసించారు.
Post Comment