బోడుప్పల్ 5వ డివిజన్లో జోరుగా సింగిరెడ్డి పద్మారెడ్డి ప్రచారం

భారీ మెజార్టీతో సునీత మహేందర్ రెడ్డిని గెలిపిస్తాం ...

బోడుప్పల్ 5వ డివిజన్లో జోరుగా సింగిరెడ్డి పద్మారెడ్డి ప్రచారం

జయభేరి, మేడిపల్లి : 

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5 వ డివిజన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కి మద్దతుగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఐదవ డివిజన్ కార్పొరేటర్ సింగరెడ్డి పద్మారెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ఐ ఐ సి టి,వేస్ట్ భీమ్ రెడ్డి నగర్ కాలనీలలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటెయ్యాలని ప్రచారం నిర్వహించారు. సందర్భంగా సింగిరెడ్డి పద్మారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఉపయుక్తంగా ఉన్నాయని,పార్లమెంట్లో తెలంగాణ గొంతుకను వినిపించేందుకు, రాహుల్ గాంధీని ప్రధాని చేయడానికి పట్నం సునీత మహేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పబ్బు సత్యనారాయణ, డివిజన్ మహిళా నాయకులు పూర్ణిమ, శైలజ తదితరులు పాల్గొన్నారు.

Read More మైనంపల్లి హన్మంతరావు ను విమర్శించే స్థాయి ప్రతాప్ రెడ్డి కి లేదు

IMG-20240510-WA3105

Read More ఉద్దేమర్రి గ్రామంలో పౌరహక్కుల దినోత్సవం