Commissioner : చెరువులో గుర్రపు డెక్క తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం

దుర్గంధం తో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన.. అధికారులు స్పందించాలని విజ్ఞప్తి

దాయరకుంట  చెరువులో గుర్రపుడెక్క నిండిపోవడంతో దుర్గంధం వెదజల్లుతుందని దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు  ఎదురుకుంటున్నారని తెలిపారు. అదేవిధంగా చెరువులో చెత్త చెదారం కూడా నిండిపోయిందని అన్నారు.

Commissioner : చెరువులో గుర్రపు డెక్క తొలగించాలని మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం

జయభేరి, మే 17:
మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలోని  దాయరకుంట చెరువులో గుర్రపు డెక్కను తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి మరియు స్థానిక వార్డు కౌన్సిలర్లు కలిసి మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు. దాయరకుంట  చెరువులో గుర్రపుడెక్క నిండిపోవడంతో దుర్గంధం వెదజల్లుతుందని దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు  ఎదురుకుంటున్నారని తెలిపారు. అదేవిధంగా చెరువులో చెత్త చెదారం కూడా నిండిపోయిందని అన్నారు. అయితే చెరువును శుభ్రం చేయాలని జనవరిలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ కు విన్నవించారని గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క, చెత్త చెదారాన్ని తొలగించాలని వారు విజ్ఞప్తి చేశారు.

70a37af1-1a21-4b6a-b5f7-41aeea30e811

Read More క్యాన్సర్ నిర్మూలన ధ్యేయంగా సత్యసాయి సేవా సమితి...