రామాలయంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన పేట్ బషీరాబాద్ ఏసిపి

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడతాయి - ఏసిపి రాములు

రామాలయంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన పేట్ బషీరాబాద్ ఏసిపి

జయభేరి, నవంబర్ 23 :
శామీర్ పేట్ లోని రామాలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పేట్ బషీరాబాద్ ఏసిపి రాములు, శామీర్ పేట్ డీఐ గంగాధర్ లు కలిసి ప్రారంభించారు. అనంతరం ఆలయ నిర్వాహకులతో మాట్లాడి ఆలయ భద్రత విషయం పై పలు సలహాలు సూచనలు అందించారు. 

ఆలయ పరిసర ప్రాంతాలలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పద వస్తువులు ఏవైనా ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని వారు సూచించారు, ఈ కార్యక్రమం లో ఎస్ ఐ లు హారిక, దశరథ్ నాయక్,శామీర్ పేట్ కట్ట మైసమ్మ దేవాలయం చైర్మన్ విలాసరం అశోక్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More Love : అమ్మను ప్రేమించలేనోడికి  అమ్మాయి కావాల్సొచ్చిందిరా?

WhatsApp Image 2024-11-23 at 23.25.05

Read More Telangana I గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (గోపా) 42వ వన భోజన కార్యక్రమం

Views: 0