కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న మేడ్చల్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు గౌరారం జగన్ గౌడ్

రాబోవు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు విజయం సాధించాలని అమ్మవారిని వేడుకున్నట్లు వెల్లడి

కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న మేడ్చల్ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు గౌరారం జగన్ గౌడ్

జయభేరి, జనవరి 28 :
శామీర్ పేట్ లోని కట్ట మైసమ్మ అమ్మవారిని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎల్లంపేట గౌరారం జగన్ గౌడ్ దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారులు జగన్ గౌడ్ కు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా జగన్ గౌడ్ మాట్లాడుతూ ఎంతో మహిమ గల శామీర్ పేట కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. 

అదేవిధంగా రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు విజయం సాధించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఇక శామీర్ పేట మండల బిజెపి అధ్యక్షునిగా ఎన్నికైన కొరివి కృష్ణ ముదిరాజ్ కు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నూతన మండల బిజెపి అధ్యక్షుడు కొరివి కృష్ణ ముదిరాజ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మండల బిజెపి అధ్యక్షునిగా నియమించినందుకు మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాగర్ గౌడ్, మల్లేష్ ముదిరాజ్, రాఘవ రెడ్డి, మహేష్, గోపాల్, నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Read More Medigadda I మేడిగడ్డ.. బొందల గడ్డ... భాష మార్చుకోకపోతే ప్రజలు చీదరిస్తారు!

WhatsApp Image 2025-01-28 at 22.37.24(1)

Read More BRS I మీకు మీరే.. మాకు మేమే.!?

Views: 0