Kamareddy : అరబ్ దేశంలో తప్పిపోయిన కామారెడ్డి జిల్లా వాసి
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన బంకొల్ల రంజిత్ వ్యవసాయ పని చేసేవాడు. అతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కామారెడ్డి, మార్చి 27 :
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజక వర్గం తాడ్వాయి కేంద్రంలో ఉపాధి లేక దేశం కానీ దేశానికి వెళ్లి తప్పిపోయిన ఉదంతం ఇది. ఎన్నో ఆశలతో డబ్బు సంపాదించి పిల్లలను బాగా చదివించాలని సంతోషంగా జీవించాలని కలలు కన్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఆచూకీ లభించకపోవడంతో అసలు బతికి ఉన్నాడో లేదో కూడా తెలియని దయనీయ పరిస్థితిలో ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు భార్య పిల్లలు ఒంటరి వారైపోయారు. బాధితుడి భార్య తన భర్త ఆచూకీ కనిపెట్టండంటు కాల్లు అరిగేల అధికారులు, నాయకుల చుట్టూ తిరుగుతున్న ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన బంకొల్ల రంజిత్ వ్యవసాయ పని చేసేవాడు. అతడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Read More KTR : కేటీఆర్కు ఏసీబీ నోటీసులు