దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేడుకలు
అధ్యక్షుడు NVT, సంధ్యారెడ్డి సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినారు. అనంతరం పండ్లు పంచి అన్నదానం చేసినారు.
జయభేరి, దేవరకొండ :
మహాలక్ష్మి మహిళ వృద్ధాశ్రమం నందు అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేడుకలు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు NVT, సంధ్యారెడ్డి సభ్యులతో కలిసి కేక్ కట్ చేసి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినారు. అనంతరం పండ్లు పంచి అన్నదానం చేసినారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు NVT మాట్లాడుతూ... ఈ సృష్టిలో తీయనైనది అమ్మ ప్రేమని, అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మని, ప్రతి మనిషి పుట్టుకకు పట్టుగొమ్మ అమ్మని, అమ్మ మనసు కాశి గంగ కన్నా పవిత్రమైనదని, నవ మాసాలు మోసి కనిపించి ప్రయోజకులు గా చేసిన తర్వాత ఎంతోమంది కన్నతల్లులను వృద్ధాశ్రమంలో వేయడము అనేది ధర్మం కాదని, ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రులని ఎంత విసిగించిన విసుగు చెందకుండా తమ వద్దనే ఉంచుకొని కడ చేరేంతవరకు వారికి సేవలు చేయాలని ఈ సందర్భంగా వారున్నారు.
Post Comment