Fire : దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అగ్ని నివారణ అవగాహన కార్యక్రమం
- అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్నట్లు, కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక దళ సిబ్బందికి జోహార్లు అర్పించినారు. వంటగదిలో గాలి వెలుతురు బాగా ఉండేటట్టు చూడాలని, ఐఎస్ఐ మార్క్ గల ట్యూబ్ ని వాడాలని, ఎల్లవేళలా నీటిని మీ ఇంటిలో నిలువ ఉండేలా చూడండి.
జయభేరి, దేవరకొండ :
స్పోర్ట్స్ అసోసియేషన్ భవనంలో అగ్ని నివారణ అవగాహన కార్యక్రమం అధ్యక్షుడు NVT సభ్యులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించినారు. అగ్ని మాపక సిబ్బంది అగ్ని నివారణ చర్యల గురించి మహిళలకు వివరించడం జరిగినది, వారితో ప్రత్యేకంగా గ్యాస్ సిలిండర్లు లీకైనప్పుడు ఎలా ఆర్పాలి అనే దానిమీద వారితోనే సిలిండర్ ఆర్పించి చూపించినారు. అనంతరం అధ్యక్షుడు NVT మాట్లాడుతూ.. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్నట్లు, కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక దళ సిబ్బందికి జోహార్లు అర్పించినారు. వంటగదిలో గాలి వెలుతురు బాగా ఉండేటట్టు చూడాలని, ఐఎస్ఐ మార్క్ గల ట్యూబ్ ని వాడాలని, ఎల్లవేళలా నీటిని మీ ఇంటిలో నిలువ ఉండేలా చూడండి. గ్యాస్ లీక్ అవుతున్నట్లు అనుమానం వస్తే వెంటనే రెగ్యులేటర్ వాల్వు ఆపి వేయండి. అటువంటి సమయంలో ఎలక్ట్రికల్ స్విచ్లు ఆన్ ఆఫ్ చేయవద్దు, ఎల్పిజి వాడకం పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ వాల్వు ఆపివేయండి అన్నారు ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని వాటిని పాటించాలని ఈ సందర్భంగా వారు తెలియజేసినారు.
Post Comment