మేడ్చల్ జిల్లా బైండ్ల కుల సంఘం నూతన కమిటీ ఎన్నిక
మాల మాదిగ ఉప కులాలతో పాటు బైండ్ల కులాన్ని 3వ కులంగా గుర్తించాలని వక్తల డిమాండ్
మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం అలియాబాద్ లోని సంగీత్ ఫంక్షన్ హాలులో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బైండ్ల కుల సంఘాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షునిగా బైండ్ల రాంచందర్, ఉపాధ్యక్షునిగా బైండ్ల శంకర్, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్, సహయ కార్యదర్శిగా ప్రశాంత్, కోశాధికారిగా నర్సింలు ను ఎన్నుకున్నారు.
జయభేరి, జూన్ 17:
ఎస్సీ కులాల్లోని మాల, మాదిగ ఉపకులాలతో పాటు బైండ్ల కులాన్ని కూడా 3వ కులంగా ప్రత్యేకంగా గుర్తించాలని ఆ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏపూరి రాంచందర్ అన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ మండలం అలియాబాద్ లోని సంగీత్ ఫంక్షన్ హాలులో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బైండ్ల కుల సంఘాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షునిగా బైండ్ల రాంచందర్, ఉపాధ్యక్షునిగా బైండ్ల శంకర్, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్, సహయ కార్యదర్శిగా ప్రశాంత్, కోశాధికారిగా నర్సింలు ను ఎన్నుకున్నారు.

అనంతరం వారికి నియామక పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎస్సీ కులాల్లోని మాల మాదిగ ఉపకులాలుగా ఏ విధంగా పిలవబడుతున్నాయో అదే విధంగా బైండ్ల ఉపకులంగా బైండ్లను గుర్తించాలని కోరారు. ఇక ఎస్సీ కులాల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ ను 15 నుంచి 20శాతానికి పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాములు, ప్రధాన కార్యదర్శి యాదగిరి, కోశాధికారి రామకృష్ణ, సలహాదారులు బైండ్ల కుమార్, సంజీవరావు, నర్సింహా, శ్రీను, సునీల్, రమేష్, బాలనర్సింహా, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post Comment