భయం వీడితే విజయం సొంతం...

పాల్త్య సహారాను అభినందించిన జిల్లా కలెక్టర్ హరిచందన

క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర కృషితో చదువులో ముందడుగు వేయాలి...  విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే భవిష్యత్తు బంగారు మాయమవుతుందని, భయం వీడితే విజయం సొంతమవుతుందని, విద్యార్థులు ఉన్నత విద్యావంతులై ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, సమాజానికి, మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు.

భయం వీడితే విజయం సొంతం...

జయభేరి, దేవరకొండ:
దేవరకొండ లోగల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చదివి ఇటీవల విడుదల అయిన ఎస్ఎస్సి ఫలితాలలో 10/10 జిపిఏ సాధించిన గుండ్లపల్లి మండలం, కళ్యా తండ గ్రామానికి చెందిన పాల్త్య గోపి కుమార్తె పాల్త్య సహారాకు  నల్లగొండ జిల్లా కలెక్టర్ హరిచందన, నల్గొండ జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, ఏటిడిఓ   లక్ష్మారెడ్డి, హాస్టల్ వార్డెన్ ఝాన్సీ రాణి కలిసి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాన్ని  అందించారు. జీవితంలో మరెన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే భవిష్యత్తు బంగారు మాయమవుతుందని, భయం వీడితే విజయం సొంతమవుతుందని, విద్యార్థులు ఉన్నత విద్యావంతులై ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, సమాజానికి, మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. క్రమశిక్షణ సమయపాలన, నిరంతర కృషితో చదువులో ముందడుగు వేయాలని తెలిపారు. 

Read More ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన  పద్మశాలి కులస్తులు