మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ గెలవడం ఖాయం...
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు...
జయభేరి, మేడ్చల్ :
బోడుప్పల్ లోని తన నివాసంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల షామేలు మీడియాతో మాట్లాడా. దేశానికి మోడీ ఈ 10 సంవత్సరాలలో ఏమీ చేయలేదు.. తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ 10 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి పరచలేదు. బిజెపి, బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలతో రెండు ఒకటే. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ బీసీ జపం చేస్తూ అగ్రవర్ణాలతో ఉంటున్నారు. పేదల వ్యతిరేకంగా ఈటెల రాజేందర్ వ్యవహరిస్తున్నారు. బిజెపి కి ఇప్పుడు ఉన్న నాలుగు స్థానాలు పోతాయి. బీజేపీ సంపన్నులకు 6లక్షల 50 వేల కోట్ల రుణాలు మాఫీ చేసింది. రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా ప్రజలను మేల్కొలుపుతున్నారు. ఉపాధి హామీపథకాన్ని కాంగ్రెస్ తెచ్చింది. మల్కాజ్ గిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. భారీ మెజారిటీతో కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలకు సామేలు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొత్త కిషోర్ గౌడ్, నత్తి మైసయ్య తదితరులు పాల్గొన్నారు...
Post Comment