కాంగ్రెస్ గెలుపుపై గజ్వేల్ లో సంబరాలు

కాంగ్రెస్ గెలుపుపై గజ్వేల్ లో సంబరాలు

జాయభేరి, గజ్వెల్, నవంబర్ 23..
దేశ సంపదను దోచుకోవడానికి కార్పొరేట్ శక్తులతో కుమ్ముకై అప్రజాస్మికంగా మహారాష్ట్రలో విజయం సాధించిందని గజ్వేల్ ఏఎంసి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ అన్నారు. శనివారం గజ్వేల్ లో ప్యాక్స్ మాజీ చైర్మన్ వెంకట్ నర్సింహారెడ్డి గజ్వేల్ మున్సిపల్ కొఆప్షన్ మెంబర్ గంగిశెట్టి రాజు సమీర్ వహీద్ తో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ వైఎన్ఆర్ లో ప్రియాంక గాంధీ విజయం పట్ల హర్షణ వ్యక్తం చేస్తూ సీట్లు పంచి సంబరాలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా సర్దార్ ఖాన్ మాట్లాడుతూ అధికారాన్ని అడ్డుపెట్టుకుని దేశంలోని కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాడానికి అవినీతిపరులంతా ఏకమై మహారాష్ట్రలో రాజకీయ చక్రం తిప్పారని దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు రేపుతూ అధికారం చేజిక్కించుకుంటున్న భాజాపాకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఆయన అన్నారు అవినీతిరహిత పాలన కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారని త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన ప్రియాంకకు అఖండ విజయాన్ని చేకూర్చిన  వయన్నారు ప్రజలకు గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నక్కా రాములు గాడేపల్లి శ్రీను, మతిన్, జహీర్, అజ్గర్, కన్నాయాధవ్ గుంటుకు శ్రీను, ఉడెం శ్రీనివాస రెడ్డి, అంధిపూర్ బలరాజ్ గౌడ్,  డప్పు గణేష్, కోడకండ్ల బాలు, సురేష్, నంగునూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు

Read More భగవాన్ సత్యసాయి పుట్టినరోజు మహిళా వృద్ధుల ఆశ్రమ నిర్మాణమునకు రు. 50,116 విరాళం 

Latest News

ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి  ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
జయభేరి, దేవరకొండ :రాష్ట్రములో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2(హెచ్) ప్రకారం అధికార యంత్రంగం సూచిక బోర్డులను తప్పనిసరిగా...
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్ 
ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికే పెద్ద పీఠ 
విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి