మహిళలని గౌరవించే సంస్కృతి బీఅరెస్ పార్టి నాయకులకు లేదు...

వర్గల్ మాజీ ఉప సర్పంచ్ పసుల రమేశ్ ముదిరాజ్ 

మహిళలని గౌరవించే సంస్కృతి బీఅరెస్ పార్టి నాయకులకు లేదు...

జయభేరి, గజ్వేల్, సెప్టెంబర్ 30 :
బీఅరెస్ పార్టీ నాయకులకు మహిళలని గౌరవించే సంస్కృతి లేదని వర్గల్ మాజి ఉప సర్పంచ్ పసుల రమేశ్ ముదిరాజ్ అన్నారు. వారు ఒక ప్రకటనలో మాట్లాడుతు ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ పై బిఅరెస్ నాయకులు దానిని తప్పుగా చిత్రీకరించి సోషల్ మీడియాలో మహిళల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని మండి పడ్డారు. 

బిఆర్ఎస్ సోషల్ మీడియాపై  కేసు నమోదు చేసి, సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని అన్నారు. మహిళ అని చూడకుండా సోషల్ మీడియాలో మంత్రి కొండ సురేఖ పై అవమానించిన వారికి వారి తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఇదేనా అని ప్రశ్నించారు.తెలంగాణలో మహిళలను గౌరవించే సంస్కృతి ఉందని దానిని బిఆర్ఎస్ నాయకులు మరిచిపోయి భిన్నంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ పార్టీకి ఓపిక సహనం నశించిపోయాయని రాజకీయ లబ్ధికోసం నీచ రాజకీయాలు చేయడం సిగ్గు చేటున్నారు.

Read More పరిశుద్ధ కార్మికులకు దసరా పండుగ సందర్భంగా కొత్త బట్టలు