ఢిల్లీలో నీటి సంక్షొభం

ఢిల్లీలో నెలకొన్న నీటి కొరత సమస్యపై కేంద్ర మంత్రి దృష్టి సారించాలని కోరేందుకు వచ్చామని తెలిపారు.మరో వైపు నీటి సంక్షోభం వల్ల ద్వారకా ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎంపీ కమల్ జిత్ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ద్వారకా ప్రాంతంలో కనీసం వాటర్ ట్యాంకర్లు కూడా అందుబాటులో లేవని ఆరోపించారు.

ఢిల్లీలో నీటి సంక్షొభం

జయభేరి, న్యూడిల్లీ :
ఢిల్లీ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. యమునా నదికి నీటి ప్రవాహం తగ్గడంతో నీటి కోసం ఇబ్బందులు తప్పడం లేదు. నీరు దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

ఇదే సమయంలో నీటి సరఫరా వ్యవస్థను దుండగులు ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఘటనను కొన్ని ప్రాంతాల్లో జరుగుతుండగా ఢిల్లీ జల మంత్రిత్వ శాఖ కీలక చర్యలకు ఉపక్రమించిందినగరానికి వచ్చే పైపులైన్లకు పహారా కాయాలని విజ్క్ష‌ప్తి చేస్తూ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసారు. రాష్ట్రంలోని కీలకమైన వాటర్ పైపులైన్ల వద్ద మరో 15 రోజుల పాటు పోలీసు భద్రత పెంచాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ను కోరుతున్నాను. నగరానికి జీవనాధారంగా మారిన వాటర్ పైప్‌లైన్లను కొందరు వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు. దానిని ఆపడం చాలా ముఖ్యం. ప్రస్తుతం నగర ప్రజలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కుంటున్నారని మంత్రి అతిశీ లేఖలో తెలిపారు.

Read More Tech layoffs this week : బైజూస్, ఆపిల్, అమెజాన్ ల్లో ఉద్యోగుల తొలగింపు..

Delhi_water_crisis_1716975166420_1716975166632

Read More Arvind Kejriwal I కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటూ.. హర్యానా టు హస్తినపురి...

ఇదిలా ఉంటే ఆప్ ఎమ్మెల్యేలు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. కేంద్రమంత్రి ఆయన నివాసంలో లేకపోవడంతో ఆప్ నేతలు వెనుదిరిగారు. అనంతరం ఎమ్మెల్యే రాఖీ బిర్లా మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో నెలకొన్న నీటి కొరత సమస్యపై కేంద్ర మంత్రి దృష్టి సారించాలని కోరేందుకు వచ్చామని తెలిపారు.మరో వైపు నీటి సంక్షోభం వల్ల ద్వారకా ప్రాంతంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎంపీ కమల్ జిత్ ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ద్వారకా ప్రాంతంలో కనీసం వాటర్ ట్యాంకర్లు కూడా అందుబాటులో లేవని ఆరోపించారు. దీంతో ప్రయివేటు ట్యాంకర్ల యజమానులు ప్రజల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. మానవత్వంతో అయినా మంత్రి అతిశీ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని కోరారు.

Read More HOUSE PRICES : ఇళ్ల ధరలు పడిపోతున్నాయి

Views: 0

Related Posts