ప్రతిభ, సృజనాత్మకతల ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేయాలి

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

ప్రతిభ, సృజనాత్మకతల ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేయాలి

జయభేరి, ముంబయి మే 1 :
భారత్ ఎంటర్ టైన్ మెంట్ హబ్ గా మారుతుందని ప్రతిభ, సృజనాత్మకతల ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ముంబయిలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్ ను మోడీ ప్రారంభించారు. వేవ్స్ సదస్సుకు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సృజనాత్మక హబ్ గా తయారై కొత్త అవకాశాలు అందిపుచ్చుకోవాలన్నారు. సంప్రదాయ, నవతరాలను సమన్వయం చేయాలని సూచించారు. మనదేశంలో 1913 లో తొలి చిత్రం రాజా హరిశ్చంద్ర విడుదలైందన్నారు. గేమింగ్ రంగంలో యువతకు అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 50 దేశాల గాయకులు కలిసి వైష్ణవ జనతో గీతం ఆలపించారని పేర్కొన్నారు.

Views: 0

Related Posts