80సార్లు రాజ్యాంగానికి మార్పులు చేసిన ఘనత కాంగ్రెస్ దే : నితిన్‌ గడ్కరీ

80సార్లు రాజ్యాంగానికి మార్పులు చేసిన ఘనత కాంగ్రెస్ దే : నితిన్‌ గడ్కరీ

న్యూ డిల్లీ ఏప్రిల్ 17:
రాజ్యాంగాన్ని మారుస్తామని బీజేపీపై ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాల ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని.. 80సార్లు రాజ్యాంగానికి మార్పులు చేసిన పాపానికి కాంగ్రెస్‌ పాల్పడిందని ఆయన విమర్శలు గుప్పించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

ప్రస్తుతం దేశంలో గాలి చూస్తుంటే బీజేపీ 370 సీట్లు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు 30కిపైగా సీట్లు గెలుచుకుంటాయన్నారు. దక్షిణ భారతంలోనూ ఎన్డీయే విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కానున్నారన్నారు. మైనార్టీలు, దళితులను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.అయినా, విజయం సాధించలేరన్నారు. కేశవానంద భారతి కేసులో ఏడుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చలేమని తేల్చిచెప్పారు. 80సార్లు మార్పులు చేసి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన పాపానికి పాల్పడిన కాంగ్రెస్.. రాజ్యాంగం మారుస్తామని మాట్లాడుతోందన్నారు. మౌలిక సదుపాయాల్లో మార్పులు అభివృద్ధిని వేగవంతం చేస్తాయన్నారు. ఈ దిశలో తాము పని చేస్తున్నామన్నారు. రోప్ వేలు, కేబుల్ కార్లు తయారు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్తుతో ప్రజా రవాణాను నడుస్తోందని.. మరిన్ని నగరాల్లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో మెట్రో రైళ్లను విస్తరించనున్నట్లు తెలిపారు. భారతదేశంలో హైపర్ లూప్ టెక్నాలజీ ప్రవేశం చూశామని.. ప్రస్తుతం గ్రీన్‌వే నిర్మిస్తున్నామన్నారు.డిసెంబర్ 2024 నాటికి దేశంలోని జాతీయ రహదారులు అమెరికాతో సమానంగా ఉంటాయన్నారు. చైనా, అమెరికాలను వదిలి ఐదేళ్లలో నెంబర్‌వన్‌ అవుతామన్నారు. రానున్న ఐదేళ్లలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, దేశం మరింత బలపడుతుందని చెప్పొచ్చన్నారు.

Read More వయనాడ్ విలయం

పదేళ్ల సంవత్సరాల పని మహారాష్ట్రతో సహా దేశవ్యాప్తంగా మంచి ఫలితాలను ఇస్తుంది. బీజేపీతో పాటు శివసేన (షిండే వర్గం), ఎన్‌సీపీ (అజిత్ వర్గం) ట్రిపుల్ ఇంజిన్ కలిగి ఉండడం ఎన్‌డీఏ బలాన్ని పెంచుతుందన్నారు. శివసేన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు చాలా మంది ఏకనాథ్ షిండే వెంట ఉన్నారని.. సహజంగా అదే నిజమైన శివసేన అన్నారు. ఈ సారి బారామతిలో కూడా ఎన్డీయే గెలుస్తుందన్న నమ్మకం ఉందన్నారు. కేంద్ర సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని విపక్షాలు అంటున్నాయని.. ఇందులో తాము జోక్యం చేసుకోమని.. ఏజెన్సీలు తమపని చేస్తున్నాయన్నారు.

Read More మళ్లీ మేనల్లుడికి బాధ్యతలు...

Social Links

Related Posts

Post Comment