MOdi : మోడీ  ఆస్తులు 3 కోట్లు

2019 ఎన్నికలతో పోలిస్తే మోడీ ఆస్తులు స్వల్పంగా పెరిగాయి. 2019లో తనకు మొత్తం 2.49 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తర్వాత 2020లో మోదీ తన ఆస్తులను ప్రకటించారు. ఈ సందర్భంగా రూ.2.85 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. బ్యాంకు బా‍్యలెన్సు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లులో రాబడి కారణంగా ఆస్తులు రూ.36 లక్షలు పెరిగినట్లు తెలిపారు. 

MOdi : మోడీ  ఆస్తులు 3 కోట్లు

జయభేరి, లక్నో, మే 15 :
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి నామినేషన్‌ దాఖలు చేశారు. వారణాసిలో గంగానదికి మొదట పూజలు చేశారు. తర్వాత కాలభైరవస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా మేజిస్ట్రేట్‌ కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. మోదీ నామినేషన్‌ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమి నేతలు తరలివచ్చారు. ఉండగా మోదీ తన నామినేషన్‌తోపాటు ఆస్తుల వివరాలతో అఫిడవిట్‌ కూడా సమర్పించారు. 2019 ఎన్నికలతో పోలిస్తే మోడీ ఆస్తులు స్వల్పంగా పెరిగాయి.

2019లో తనకు మొత్తం 2.49 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తర్వాత 2020లో మోదీ తన ఆస్తులను ప్రకటించారు. ఈ సందర్భంగా రూ.2.85 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. బ్యాంకు బా‍్యలెన్సు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లులో రాబడి కారణంగా ఆస్తులు రూ.36 లక్షలు పెరిగినట్లు తెలిపారు. ప్రధాని లైఫ్‍ ఇన్ఫూరెన్స్(ఎల్‍ఐసీ), నేషనల్‍ సేవింగ్స్ సర్టిఫికేట్లు (ఎన్‌ఎస్‍సీ), బాండ్ల ద్వారా పన్ను మినహాయింపు కోసం ప్రయత్నించారు. 2024 ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం.. మోదీ తన చేతిలో ప్రస్తుతం 52,920 నగదు తన చేతిలో ఉన్నట్లు పేర్కొన్నారు. బా‍్యంకు ఖాతాలో 80,304 నగదు ఉన్నట్లు తెలిపారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు 2,85,60,338 ఉన్నట్లు వెల్లడించారు.

Read More ఐఏఎస్ పూజా... సర్వీస్ నుంచి తొలగింపు

ఇక రూ.2.67 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నట్లు తెలిపారు. పలు ఇన్సూరెన్స్‌ పాలసీలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా తన ఆస్తి రూ.3 కోట్లని వెల్లడించారు. ఇప్పటివరకు మోదీ ఎలాంటి అప్పు తీసుకోలేదు. ఆయన పేరిట ఎలాంటి వాహనం కూడా లేదు. గాంధీనగర్‍లోని సెక్టార్‍ 1లో 3,531 చదరపు గజాల ఓ ప్లాటు ఉన్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆస్తి అయిన ఆ ప్లాటుకు మోదీతోపాటు నలుగురు ఉమ్మడి హక్కుదారులు ఉన్నారు. గుజరాత్‍లో 10 చోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. తన తల్లి నుంచి వచ్చిన ఈ ఆస్తుల విలువ రూ.13.56 కోట్లు. ఈ అఫిడవిట్‌లో తన భార్య పేరిట ఉన్న ఆస్తుల వివరాలు పేర్కొనలేదు.

Read More 24 గంటల్లో 24 ప్లాస్టిక్ సర్జరీలు