ఎలక్ట్రానిక్‌ సెక్టార్‌లో దూసుకుపోతోన్న భారత్‌

సెమీకండక్టర్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ను ప్రోత్సహించేందుకు చర్యలు
ఈ దశాబ్దం చివరి నాటికి 500 బిలియన్‌ డాలర్లు చేరుకోవడమే ప్రభుత్వ లక్ష్యం
ఈ రంగం నుంచి ఏకంగా దాదాపు 60 లక్షల ఉద్యోగాలు
 ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి

ఎలక్ట్రానిక్‌ సెక్టార్‌లో దూసుకుపోతోన్న భారత్‌

జయభేరి, గ్రేటర్‌ నోయిడా, సెప్టెంబర్ 11 :
ఎలక్ట్రానిక్‌ సెక్టార్‌లో భారత్‌ దూసుకుపోతోందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. దేశీయంగా పెద్దసంఖ్యలో చిప్స్‌ తయారీపై భారత్‌ ప్రస్తుతం దృష్టిసారించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సెమీకండక్టర్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నదని చెప్పారు.

గ్రేటర్‌ నోయిడాలో బుధవారం ఇండియా ఎక్స్పో మార్ట్‌లో సెమీకాన్‌ ఇండియా 2024 ప్రారంభ కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెమీ కండక్టర్ల ఉత్పత్తి కోసం పలు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భారత్‌లో మరిన్ని చిప్‌లు తయారు కావాలన్నారు.ఎలక్ట్రానిక్‌ సెక్టార్‌లో ప్రస్తుతం భారత్‌ 150 బిలియన్‌ డాలర్ల మైలురాయిని చేరుకుందని.. ఈ దశాబ్దం చివరి నాటికి 500 బిలియన్‌ డాలర్లు చేరుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

Read More మొదటి స్పీచ్ లోనే అదరగొట్టిన శబరి

దీని కారణంగా దేశంలో దాదాపు 60 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని ప్రధాని చెప్పారు.సెమీకండక్టర్‌ మ్యాన్యుఫ్యాక్చరింగ్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలతో బాసటగా నిలుస్తున్నదని చెప్పారు. భారత్‌ అనుసరిస్తున్న విధానాలతో భారత్‌లో లక్షన్నర కోట్లకు పైగా విలువైన పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రానిక్‌ రంగ మార్కెట్‌ 150 బిలియన్‌ డాలర్లకు పైగా ఉందని, దీన్ని మరింత పెంచాలనేది తమ లక్ష్యమని ప్రధాని వివరించారు.

Read More ఆర్మీ, నేవీ చీఫ్‌లుగా స్నేహితులు

ఈ దశాబ్ధం చివరికి మన ఎలక్ట్రానిక్ రంగం 500 బిలియన్‌ డాలర్ల స్ధాయికి ఎదగాలనే లక్ష్యం నిర్ధేశించుకున్నామని తెలిపారు. దీంతో భారత యువత కోసం ఈ రంగం నుంచి ఏకంగా దాదాపు 60 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. నైపుణ్యాలు సంతరించుకుంటే పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు మన యువతకు పుష్కలంగా లభిస్తాయని మోదీ వివరించారు.

Read More జలవిలయాల ప్రభావం తగ్గించలేమా