ఏఐతో ఉద్యోగాలపై ప్రభావం...

ఇక ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లో నుంచి ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనికి అనుగుణంగా ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున జరుగుతోన్న ఉద్యోగాల కోతలు, కొత్త రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో ఈ వార్తలకు బలాన్ని చేకూర్చినట్లైంది. అయితే తాజాగా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే కూడా ఇదే విషయాన్ని చెబతోంది.

ఏఐతో ఉద్యోగాలపై ప్రభావం...

న్యూఢిల్లీ, జూలై 23 :
ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్‌ (AI) ప్రపంచాన్ని శాసిస్తోంది. దాదాపు అన్ని రంగాల్లో కృత్రిమ మేధ వినియోగం అనివార్యంగా మారింది. సెర్చ్‌ ఇంజన్స్‌మొదలు సోషల్‌ మీడియా సైట్స్‌ వరకు ఏఐని ఉపయోగిస్తున్నాయి.

ఇక ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తొలి రోజుల్లో నుంచి ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనికి అనుగుణంగా ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున జరుగుతోన్న ఉద్యోగాల కోతలు, కొత్త రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో ఈ వార్తలకు బలాన్ని చేకూర్చినట్లైంది. అయితే తాజాగా పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే కూడా ఇదే విషయాన్ని చెబతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ఉద్యోగులపై కచ్చితంగా తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆర్థిక సర్వే సైతం వెల్లడించింది. ఉద్యోగాల కల్పనపై ఏఐ ప్రతికూల ప్రభావం చూపడం ఖాయమని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

Read More FTCCI with the support of MSME I షిప్పింగ్.. లాజిస్టిక్స్‌పై అంతర్జాతీయ సదస్సు

aiiiiiiiiiiiiii_V_jpg--442x260-4g

Read More Arvind Kejriwa I ఈడీ కస్టడీలో లాకప్ లో భారంగా తొలిరాత్రి

కృత్రిమ మేధ ఉత్పదకతను పెంచుతుందననడంలో ఎంత వరకు నిజం ఉందో.. ఈ ప్రభావం అనేకరంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల మీద పడుతుందనడంలో కూడా అంతే నిజం ఉందని సర్వేలో పేర్కొన్నారు. రోజుల్లో దాదాపు ప్రతీ రంగంలో ఏఐ మార్పులను తీసుకొచ్చిందని, దీంతో ఆయా రంగాల్లో ఉద్యోగుల సంఖ్య ఖాయమని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఈ ఏఐ ప్రభావం భారత్‌తో పాటు ప్రపంచంలోని చాలా దేశాలపై కచ్చితంగా ప్రభావం చూపనుందని పేర్కొన్నారు. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలో ఊహకందని మార్పులు జరిగే అవకాశం ఉందని సర్వేలో పేర్కొన్నారు.

Read More Total Solar eclipse on April 8 : ఏప్రిల్ 8 ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం

ఇదిలా ఉంటే సర్వేలో పేర్కొన్న విషయాల ప్రకారం ఇప్పటికే చాలా రంగాల్లో ఏఐ వాడాకాన్ని బాగా పెంచేశారు.ఐటీ కంపెనీలతో ఇతర కంపెనీల్లో కూడా ఏఐ వినియోగాన్ని పెంచేశారు. కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడంతో పాటు, ఉద్యోగులను తగ్గించుకోవచ్చనే ఉద్దేశంతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కారణంగా.. కస్టమర్ సర్వీస్, టీచింగ్, యాంకరింగ్ వంటి రంగాలపై కూడా ప్రభావం పడనుందని నిపుణులు అంచణాలు వేస్తున్నారు. ఏఐకి సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకుంటేనే ఉద్యోగులు రాణించగలని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read More Odisha Gopalpur Port Adani : అదానీ ఖాతాలో కొత్త పోర్టు..!

Views: 0

Related Posts