ఆర్మీ, నేవీ చీఫ్‌లుగా స్నేహితులు

ఆర్మీ, నేవీ చీఫ్‌లుగా స్నేహితులు

భారత సైన్యంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. చరిత్రలో తొలిసారి ఆర్మీ, నేవీలకు స్నేహితులు చీఫ్‌లు అయ్యారు. మే 1న నేవీ చీఫ్‌గా అడ్మిరల్ దినేష్ త్రిపాఠి బాధ్యతలు చేపట్టారు. త్వరలో ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు చేపట్టనున్నారు. వీరిద్దరూ పాఠశాల స్థాయి నుంచి స్నేహితులు. సైన్యంలో చేరి, అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత హోదాలు నియమితులు అయ్యారు.