ల్యాండ్ ను ఆక్రమించగా.. పట్టుకుని రిమాండ్
ల్యాండ్ ఓనర్ లు అందుబాటులో లేకపోవడంతో ఆ ప్లాట్ లను ఎలాగైనా ఆక్రమించాలనే దురుదెశ్యంతో ల్యాండ్ ఓనర్ లు చనిపోయినట్లుగా ఫేక్ డెత్ సర్టిఫికేట్ లు క్రియేట్ చేసి, ఆ ల్యాండ్ ఓనర్ లకు గుర్తు తెలియని వ్యక్తులను లీగల్ హైర్ సర్టిఫికేట్ స్పృష్టించి, ల్యాండ్ ను వారి మీద రిజిస్ట్రేషన్
జయభేరి, మేడిపల్లి :
మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల చెంగిచెర్ల గ్రామంలోని రామకృష్ణ లే అవుట్ కు చెందిన 1000 చదరపు గజాల విస్తీర్ణం గల ల్యాండ్ ను.. ల్యాండ్ ఓనర్ లు అందుబాటులో లేకపోవడంతో ఆ ప్లాట్ లను ఎలాగైనా ఆక్రమించాలనే దురుదెశ్యంతో ల్యాండ్ ఓనర్ లు చనిపోయినట్లుగా ఫేక్ డెత్ సర్టిఫికేట్ లు క్రియేట్ చేసి, ఆ ల్యాండ్ ఓనర్ లకు గుర్తు తెలియని వ్యక్తులను లీగల్ హైర్ సర్టిఫికేట్ స్పృష్టించి, ల్యాండ్ ను వారి మీద రిజిస్ట్రేషన్ చేయించి, తర్వాత వారి దగ్గర నుండి ఆ వ్యక్తులు వారి మీద రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత మిగతా వ్యక్తులకు తక్కువ రేట్ కు ల్యాండ్ వస్తుందని వారందరూ కలిసి కుమ్మక్కు అయ్యి వచ్చిన డబ్బులను అన్నిటిని సమానంగా పంచుకోగా, ఆ ల్యాండ్ GPA హోల్డర్ ముళ్ళపూడి వెంకట సుబ్బారావు అను వ్యక్తి ఫిర్యాదు మేరకు వారి అందరి మీద కేసు నమోదు చేసి, ఆదివారం ల్యాండ్ ఆక్రమించిన వ్యక్తులలో మల్లాపూర్ కు చెందిన లింగాల రవీందర్, చెంగిచెర్లకు చెందిన తీగల దేవేందర్ అను వ్యక్తులను పట్టుకుని రిమాండ్ కు తరలించడం జరిగినది.


