79వ వార్డు పరిధి సమస్యలుపై కార్పొరేటర్ రౌతు అధికారులతో పరిశీలన 

79వ వార్డు పరిధి సమస్యలుపై కార్పొరేటర్ రౌతు అధికారులతో పరిశీలన 

జయభేరి, పరవాడ:
79 వ వార్డు పరిధిలో గల ప్రాంతాలు అయ్యిన దేశపాత్రునిపాలెం గ్రామం జాజులవానిపాలెం, శ్రీనివాస నగర్, ఎస్సీ కాలనీ, సాయి నగర్ కాలనీ, అశోక్ నగర్ కాలనీ ఏరియాలలో ప్రతి వీధి తిరిగి ముఖ్య సమస్యలైనా రహదారులు, వీధి కాలువలు బాగుచేయ్యడానికి కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ గుర్తించి పబ్లిక్ వర్క్స్ అధికారులతో అంచనాలు వెయ్యంచారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తయారుచేసిన అంచనాలన్నీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్కి , స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు దృష్టికి తీసుకువెళ్లి పనులు పూర్తయ్యేలా చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పబ్లిక్ వర్క్స్, వర్క్ ఇన్స్పెక్టర్ సురేష్, సానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.

Read More AP Election : నామినేషన్లకు సర్వం సిద్ధం.. ఏపీ ఎన్నికల సమరానికి రేపే నోటిఫికేషన్..!

Views: 0

Related Posts