డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు
జయభేరి : ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనుంది.
గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో.. కొత్తగా పెళ్లిళ్లు అయినవారు, రాజకీయాల కారణాలతో రేషన్ కార్డులు రానివారు వేల సంఖ్యలో ఎదురుచూస్తున్నారు. కొత్త రేషన్ కార్డులు, కార్డుల్లో మార్పులు, సభ్యుల తొలగింపు.. ఇలా అన్నీ కలిపి ప్రస్తుతం 3,36,72000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. కొత్త దరఖాస్తులతో పాటు వీటిని కూడా పరిశీలించి కొత్త రేషన్ కార్డు్ల్ని అందించనుంది కూటమి ప్రభుత్వం.
Read More Jagan : బీజేపీ బానిస జగన్
Views: 0


