Telangana I ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్ధకమేన!?
జాతీయ పార్టీల అహంకారానికి బలి కావాల్సిందేనా!?
జయభేరి, హైదరాబాద్ :
నిజం మాట్లాడితే ఊరు నాకు అచ్చు రాదు అనే విధంగా నేడు జరుగుతున్నది ఏమిటి!? భారతదేశంలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం ఎప్పటి నుంచి జరిగింది? ప్రాంతీయ పార్టీలు ఎలా ఏర్పడతాయి? ప్రాంతీయ రాజకీయ పార్టీల ఆవశ్యకత ఏంటి? భారతదేశంలోని ప్రాంతీయ పార్టీల మనుగడ నేడు ప్రశ్నార్ధకంగా మారడానికి కారణమైన రాజకీయ కుట్రలు? ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రాంతీయ పార్టీల మనుగడకు సవాళ్లుగా నిలుస్తున్నాయి!? మరి ఈ సమస్య తీరేదేలా? అనే విషయంపై 'జయభేరి' సగర్వంగా అందిస్తున్న రాజకీయ విశ్లేషనే కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్!
ప్రాంతీయ పార్టీ ఏర్పడడానికి ప్రధాన కారణాలేంటి!?
ప్రాంతీయ పార్టీలుగా ఏర్పడడానికి ప్రధాన కారణాలు ఆ రాష్ట్రం యొక్క సామాజిక భౌగోళిక ఆర్థిక విద్య వైద్యం ఉపాధి విభిన్న రంగాల అభివృద్ధి సంక్షేమం, వీటిపై ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అలాగే సాంస్కృతి సాంప్రదాయాలు పండుగలు పర్వదినాలు వాటి ప్రాముఖ్యత విశిష్టతను జోడించుకొని ప్రాంతీయ పార్టీల ఆవిర్భాగం పురుడు పోసుకుంటుంది. అలాగే రాష్ట్రీయ సరిహద్దుల్లోనే జల భూ వివాదాల పరిష్కారం కోసం కూడా ప్రాంతీయ పార్టీలు ఏర్పడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ పార్టీగా ప్రజల ఆధారాభిమానాలను అందుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత అనేక సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించే విధంగా ముందుకు వెళ్లే ప్రయత్నాన్ని చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రాంతీయ పార్టీల యొక్క అవసరాల దృశ్య జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీల సమస్యలను సవాళ్లను ఎదుర్కొనడానికి కావలసిన నిధులను మంజూరు చేయవలసి ఉంటుంది. ఇక్కడే అసలైన సమస్య తలెత్తే అవకాశాలు మెండుగా కనిపిస్తాయి. ఒకటి ప్రాంతీయ పార్టీ అధికారం కలిగిన రాష్ట్రాలలో జాతీయ పార్టీ అంటే కేంద్రంలో ఉన్న పార్టీతో రాష్ట్ర ప్రాంతీయ పార్టీ సత్సంబంధాలు మంచిగా కలిగి ఉండాలి. అలా లేని పక్షంలో నిధులు సరిగా ఇవ్వలేదని ప్రాంతీయ పార్టీ ఆయా నియోజకవర్గాలలో ప్రజలకు చెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ దశలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంయోగ్య కుదరక అనతి కాలంలోనే ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలలో కలవడం మొదటి మెట్టుగా మారుతుంది.
ప్రాంతీయ పార్టీలపై జాతీయ రాజకీయాల ప్రభావం!?
వరసగా అంటే ఏళ్ల తరబడి కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటూ ప్రాంతీయ పార్టీలు గల రాష్ట్రాలలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించకుండా రాజకీయంగా ప్రాంతీయ పార్టీలకు ప్రతిపక్షాలుగా ఉన్న ఆయా పార్టీలను మచ్చిక చేసుకుని వారిపై అవిశ్వాస తీర్మానాన్ని ఏర్పరిచే దిశగా జాతీయ రాజకీయాలు రాజకీయ రచనలు చేస్తా ఉంటాయి. ఇలాంటి క్రమంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంయోగ అవునంటే ప్రాంతీయ పార్టీ కాదు అంటూ కేంద్రంలో ఉన్న అధికార పార్టీ ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటూ ప్రజలకు సమస్యలను పరిష్కరించే దిశగా ఆచరణాత్మకంగా అడుగులు పడలేవు. ఈ క్రమంలో ఏకచిత్రాధిపత్యం సెంట్రల్ లో చెలయించాలని చూస్తున్న ఏళ్ల తరబడి ఎన్నికవుతున్న ఆయా పార్టీలు కచ్చితంగా జాతీయ పార్టీల విధివిధానాలను ప్రాంతీయ పార్టీలపై రుద్దుతూ ప్రాంతీయ పార్టీలను భూస్థాపితం చేయడానికి అవకాశాలు అనువైన మార్గాలు వెతుకుతూ ఉంటాయి. దీన్నే రాజకీయంగా ప్రాంతీయ పార్టీలకు కేంద్ర జాతీయ పార్టీలకు మధ్య వైర్యం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ప్రాంతీయ పార్టీల ద్వారా కేంద్ర ప్రభుత్వాలకు ఎదురయ్యే సవాళ్లు ప్రతి సవాళ్లు!?
ప్రాంతీయ పార్టీలు ముందుగా మనం చెప్పుకున్నట్టుగా రాష్ట్ర భౌగోళిక మౌలిక వసతులు ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయాలు ఆర్థిక వనరులు జల వివాదాలు భూ వివాదాలు వీటన్నింటినీ కలిపి ఆత్మ గౌరవం కోసం మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో పుట్టినవే ప్రాంతీయ పార్టీలు. ఇలాంటి ప్రాంతీయ పార్టీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు ప్రాజెక్టులకు అయ్యే ఖర్చు కోసం తగిన విధంగా నిధుల మంజూరు ప్రాజెక్టులను జాతీయం చేయకపోవడంపై పలు రాజకీయ దుమారం ఇలా అన్ని భౌగోళిక మౌలిక వసతుల కల్పనకు సహకరించకపోవడం కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వాలు అంటే ప్రాంతీయ పార్టీలు సవాళ్లను సంధించే దిశగా అడుగులు పడతాయి.
ఈనాడు మనం చూస్తున్న కేంద్ర పార్టీ బిజెపి అధికారంలో రెండుసార్లు భారత ప్రధానిగా నరేంద్ర మోడీ పాలన కొనసాగిస్తున్న నేటి తరుణంలో భారతదేశంలో ఉన్న రాష్ట్రాలలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్ పాలనకు శ్రీకారం చుట్టి ఆయా రాష్ట్ర సర్వహక్కులను తన వశం చేసుకుంది బిజెపి పార్టీ. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ముందుగా అనుకున్నట్టే సిబిఐ ఈడి ఇలాంటి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ సంస్థలన్నీ కేంద్ర పరిధిలో ఉంటున్న కారణం చేత రాష్ట్రాలపై ప్రాంతీయ పార్టీలు పాలన కొనసాగిస్తున్న వ్యవస్థపై ఏదో రకంగా బురద జల్లుతూ ప్రాంతీయ పార్టీలను భూస్థాపితం చేయాలనే యోచన లేకపోదు. అందులో భాగంగానే నేడు జరుగుతున్న అరెస్టుల పర్వం సిబిఐ ఈడి చేస్తున్న దాడులు ఇలాంటివి చెప్పుకోవచ్చు. ఇంకోవైపు తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన ఈ డి అదే కేసులో 100 కోట్లు చేతులు మార్పి ఇవ్వడంలో సూత్రధారిగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కే శ్రీవారు ముఖ్యమంత్రిగా తప్పు చేశారనే ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీ వాళ్ళని అరెస్టు చేసి పది రోజులు రిమాండ్ కూడా పంపారు. ఇక తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ను కూడా తన వశం చేసుకోవాలనుకున్న బిజెపి ఇప్పటికే టిడిపి జనసేన పొత్తు కుదుర్చుకొని ఎలాగైనా జగన్ ని ఓడించాలి అనే ఉద్దేశంతో బిజెపిని కూడా కలుపుకొని మూడు పార్టీలు ఏకమై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఉద్దేశంతో రాజకీయ కుట్రలకు తెరలేపింది. ఇది రాజ్యాంగబద్ధమైన కేవలం ముఖ్యమంత్రిని ఓడించడానికి ఇలా మూడు పార్టీలు కలిసి ఒకరిపై దాడి చేయడం ఎంతవరకు సమంజసం అని వైసిపి అభిమానులు బాహాటంగానే పెదవి విరుస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే బీహార్ ఉత్తరప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో కూడా బిజెపి గవర్నర్ వ్యవస్థను ముందుకు తీసుకువచ్చి సన్యాసం తీసుకున్న వారిని ఆధ్యాత్మికంగా గురువుగా ఉంటున్న వారిని ముఖ్యమంత్రులుగా చేస్తూ హిందుత్వ వాదంతో జాతీయ భావాన్ని మా పార్టీ ద్వారానే పెంచుతాం అంటూ దేశ రాజకీయాల్లో హిందుత్వ మతానికి పునాదులు వేస్తూ రామ మందిరం నిర్మాణం చేయడం కానీ మరొక ఆలయ నిర్మాణానికి పూనుకోవడం కానీ చేస్తున్న పనులను ప్రజలు ఇప్పటికే అర్థం చేసుకుంటున్నారు. మొత్తానికి ప్రాంతీయ పార్టీల మనుగడ ముమ్మాటికీ అది ప్రశ్నార్ధకంగానే మారిపోతుంది.
ప్రాంతీయ పార్టీలు ఆత్మగౌరవంతో మన పాలన మనమే చేసుకోవాలి మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో ఏర్పడిన ప్రాంతీయ పార్టీల లక్షణాలు ఆయా రాష్ట్రంలో ఆయా నియోజకవర్గాలలో ఉన్న మౌలిక భౌగోళిక వసతుల అభివృద్ధి కొరకు సంక్షేమం కొరకు ఎక్కువగా శ్రమిస్తూ ఉంటాయి ఎక్కువగా ఉచిత పథకాలను కూడా అందించే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీకి బలి కాక తప్పడం లేదు. కానీ ప్రాంతీయ పార్టీల సెగ ఒక్కొక్కసారి జాతీయ పార్టీలకు తాకి షాక్ తగిలిన తలగకపోదు... రాష్ట్ర రాజకీయాల్లో పుట్టిన ప్రాంతీయ పార్టీలు దేశ రాజకీయాల్లో అంతగా పరిరవెల్లడం లేదు. కానీ ప్రాంతీయ పార్టీలకు అత్యంతమైన శక్తి ముందు జాతీయ పార్టీల పప్పులు ఏం ఉడకవ్.... ఎన్ని మాట్లాడుకున్నా ఎంత చర్చించినా ఎంత విశ్లేషణ చేసుకున్నా ప్రాంతీయ పార్టీల ప్రభావం ఒకటి రెండు లేదా మూడు సార్లు పరిపాలన పగ్గాలు చేత పట్టుకున్న ఆ తర్వాత జాతీయ పార్టీలో మమేకం కావాల్సిందే అన్నది ఈ చరిత్ర చెబుతున్న సాక్ష్యం....
...కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత


