Telangana I ఎడపెడ మీటింగులు జనం బేజారు.. కాంగ్రెస్ లో అంతర్గత పోరు!?
నెక్స్ట్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ లో ఎవరు?
జయభేరి, హైదరాబాద్ :
భారతదేశంలో పార్లమెంటు ఎలక్షన్లు సమీపిస్తున్న కొద్ది ఒకవైపు ఎన్నికల కోడ్ ఇవ్వాళ!? రేపా!? అనే సందిగ్ధంలో కొందరు ఉంటే! మరికొందరు త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాలని చక చక పనులను ముగించుకునే ప్రయత్నంలో మునిగి తేలుతుంటే! రాజకీయ నాయకులకు మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. భాగ్యనగరంలో ఒక్కరోజే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు ప్రతిపక్ష పార్టీ కెసిఆర్ మీటింగ్ మరోవైపు బిజెపి అమిత్ షా పర్యటన మొత్తానికి భాగ్యనగరం మీటింగులతో అట్టుడికి పోయింది.
ఇక మొట్టమొదలు కేసీఆర్ సమర శంఖారావం గురించి ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే.. కెసిఆర్ రాకముందు సార్ 10 నిమిషాల్లో వస్తున్నాడు అని ఇంకా ముఖ్యమంత్రి నీ అనుకునే ప్రయత్నంలోనే సభ సభ్యులంతా కేసిఆర్ కోసం ఆసక్తిగా ఎదురుచూడ సాగారు. ఇక ఎమ్మెల్యే పదవి నుంచి వైదొలిగిన రసమయి బాలకిషన్ మళ్ళీ మైకందుకొని పాత పాటే మొదలెసుకున్నాడు... కనీసం సిగ్గు లజ్జ మానం మర్యాద అన్ని వదిలేసి మళ్లీ అయోడివా నువ్వు అమ్మోడివా అంటూ పాత పాటనే అందుకున్నాడు. ఇంకా ముందుకు ఒక కడిగేసి జానపద పాటలు పాడాడు. అసలు అది కేసీఆర్ మీటింగ్ అనుకున్నాడు లేదంటే ఓ టీవీ రియాలిటీ షో అనుకున్నాడు తెలియదు కానీ బాగా దొంగతనంగా మెక్కిన నక్క పూల ఎలా పెడుతుందో అలా కారు కూతలు కూస్తూ తన అక్కసను పాటల రూపంలో వేదిక మీద వెళ్ళబోసుకున్నాడు బాలకిషన్.... ఈయన పాటలు నచ్చక వాళ్ళ పార్టీ పెద్దలే కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న వినోద్ పాటను ఒకసారి మేము వేసుకుంటాం ఆగు అన్నదాత ఆయన వాగుడుకు మూత పడలేదంటే అతిశయోక్తి కాదు..
ఈగ కేసీఆర్ వచ్చిన తరువాత మళ్లీ సన్నాసులు అనే పదాలను మొదలు వేసుకుంటూ మమ్మల్ని అంటరా తెలంగాణ అంటే టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ అంటే తెలంగాణ అన్నట్టుగా ప్రజలను మరోమారు మంత్రముగ్ధుల్ని చేసే ప్రయత్నం చేశారు. ఇంకొక అడుగు ముందుకేస్తూ ఇక టీవీలల్ల చర్చ వేదికలలో కూర్చొని కాలేశ్వరం ప్రాజెక్టు గురించి దాని గొప్పదనాన్ని గురించి ఈయన దాన్ని ఎలా నిర్మించాలి అనుకున్నాడు ఎలా నిర్మించాడు అన్ని వివరాలు టీవీ చర్చలలో కూర్చొని ఇంటింటికి చెప్తాడట... నిజానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఇక్కడే కూర్చుంటా కురిసేసుకొని మరీ కూసోని పని చేపిస్తా అని చెప్పిన ఈ పెద్దమనిషి నడవలేని పరిస్థితిలో కూడా పరిగెత్తే గుర్రంలా మాట్లాడుతుంటే ఎలా నమ్మాలి అంటూ అభిమానుల్లోనే అలజడి మొదలైందట... మొత్తానికి కెసిఆర్ పెట్టిన కరీంనగర్ సభ దూడ బసవన్నల పేకాటలో జోకర్లా మారిపోయింది మిగిలిపోయింది..
ఇక బిజెపి మీటింగ్ లో పాతబస్తీకి ఎంపీ అభ్యర్థిగా టిఆర్ఎస్ నుంచి ఎంపికైన మాధవి లత మహిళా శక్తి గురించి సంబోధిస్తూ మేము తల్లిలా ప్రేమిస్తాం కడుపు నింపుతాం అంటూ హిరణ్యకశ్మిని చంపాం, వాళ్లను చంపాం వీళ్లను చంపాం అంటూ మహిళా శక్తిని మరొక మారు ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసిన మాధవి లత మాటల్లో అంత రాజకీయ పసల్ లేకపోవడంతో ప్రజలు ముఖ్యంగా బీజేపీకి చెందిన కార్యకర్తలు అభిమానులు అమిత్యాన్ని చూడడానికి వచ్చిన ప్రజలందరూ హుసురుమంటూ నిట్టూర్పు తీశారు.
పాతబస్తీలో ఎంఐఎం పార్టీకి చెందిన అభ్యర్థి పై హిందూ భావజాలంతో ఎంపీ అభ్యర్థిలో బిజెపి నుంచి దిగిన మాధవి లత ప్రారంభ దశలోనే ఎంపీ సీటు కొట్టేద్దామనుకుందో ఏమో తెలియదు కానీ బిజెపి బలి పశువును చేసింది అని చెప్పక తప్పదు. ఎందుకంటే పాతబస్తీ నుంచి రాజాసింగ్ బిజెపి నుంచి ఏకధాటిగా విజయం గా మోగిస్తుంటే అదే విజయపథంలో నడిపింపడానికి మహిళా శక్తిని మేము తీసుకొచ్చాం అని బిజెపి చెబుతున్నప్పటికీ మాధవి లత విరంచి హాస్పిటల్ కు చెందిన చైర్మన్ కాబట్టి కాస్త కూసో కరెన్సీ కట్టలు సమర్పించుకుందో ఏమో తెలియదు కానీ ఏకంగా ఎంపీ సీటుకు ఎరవేసింది. లేదా బిజెపి ఆమెను రాజకీయంలోకి దింపిందో తెలియదు కానీ మొత్తానికి బిజెపి పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా మాధవి లత ప్రసంగం ఆద్యంతో ఆసక్తిని కలిగించకుండా నిరాశక్తిని చూపిస్తూ మాట మాట్లాడితే హిందూ పురాణ చరిత్రను దేవి దేవతలను ఒక రాజకీయ మీటింగ్లో ప్రస్తావన తెస్తూ అదే పురాణాలను వదిలిస్తుంటే ఇక్కడ ఆధ్యాత్మిక చర్చ ఏదైనా నడుస్తోందా లేదంటే రాజకీయ మీటింగ్ ఏమైనా నడుస్తుందా అన్న అనుమానం వచ్చింది వీక్షకులకు... మొత్తానికి బండి సంజయ్ ఉపన్యాసం కాస్త ఘాటెక్కించిన 100 రోజుల్లో ఏం పని చేస్తాడు కాంగ్రెస్ ప్రభుత్వం మేము చూస్తాం అంటున్నారే కానీ మరి రెండు సార్లు ఎం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎలాంటి ఘనకార్యాలు చేశారు ప్రజలకు మాత్రం చెప్పే ప్రయత్నం చేయలేదు.. మొత్తానికి బీజేపీ ఏర్పాటు చేసుకున్న సభ కార్యక్రమం పూర్తిగా రామ భజన చేసింది తప్ప ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం చేస్తాము ఏంటో చెప్పలేకపోయింది. ఇక ఓబిసి రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంటు సభ్యుడు బంగారు లక్ష్మణ్ మాట్లాడుతూ భారతదేశం మొత్తం మోడీ కుటుంబం అంటూ ఏకంగా భారతదేశంలో అతి తెలివైనోడు అతి విజ్ఞానవంతుడు అతి బహు సంపన్నుడు అన్నట్టుగా ప్రధానమంత్రి మోడీని కీర్తిస్తూ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అవహేళన పట్టించాడు. మొత్తానికి బీజేపీ రామ భజన తప్ప మోడీ భజన వందేమాతరం జై భరతమాత ఈ మూడు నినాదాలతోనే అధికార పార్టీని బీఆర్ఎస్ ని తిట్టడమే పనిగా పెట్టుకుని తామేం చేస్తాము తామేం చేసాము అనే విషయాలను చెప్పడం మరిచిపోయి సభను జైశ్రీరామ్ తోనే ముగించుకున్నారు...
ఇక అధికార పార్టీ సీఎం రేవంత్ రెడ్డి వడ్డీ లేని రుణాలతో ఇస్తూ మరొక స్కీమును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి సోనియా గాంధీ మనసు చలించి పార్లమెంటు తలుపులు దగ్గరేసి రాష్ట్రాన్ని ఇచ్చిందే తప్ప ఎవరో వెళ్లి చావు నోట్లో తల పెడితే తెలంగాణ రాలేదు అంటూ గట్టిగా కేసీఆర్కు చురకలంటించారు. అలాగే ఇప్పటివరకు మహాలక్ష్మి లకు ఎటువంటి సంక్షేమ పథకాలు ఫలాలు అందించాము వివరిస్తూ 500 కి గ్యాస్ సిలిండర్ 200 యూనిట్ల వరకు విద్యుత్తు ఫ్రీ అనే సంక్షేమ పథకాలను పూర్తిగా మహిళలతో పంచుకున్నారు. 100 రోజుల్లోనే ఏ ఏ కార్యక్రమాలను విజయవంతంగా చేశారు వివరిస్తూ మహాలక్ష్మి పథకంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ టిఆర్ఎస్ నేతల కుటుంబాల్లో ఉన్న మహిళలు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఎంచక్కా ప్రయాణించొచ్చు అనే వ్యాఖ్యలు చేస్తూ ఘాటుగా చురకలంటించారు టిఆర్ఎస్ శ్రేణులకు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో ఈయన ప్రభుత్వం పై ఈయన అభిమానులే కొంత విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్న ఇంకా అవి తెర మీదికి రావడం లేదు...
ఎందుకంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి జెన్కో ఎండి ప్రభాకర్ ను పిలిపించి మాట్లాడి అవినీతిని రాబట్టాలి అని క్యాబినెట్ మంత్రులకు ఆదేశాలు ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేసిన కనీసం ప్రభాకర్ రెడ్డి వచ్చిన దాఖలాలు లేవు నేను రాను అంటూ ఒక ప్రకటన చేసి 100 రోజులు గడుస్తున్న ఇంతవరకు ఆయనతో మాట్లాడింది లేదు అవినీతిని బయటపెట్టింది లేదు అని ఆరోపణలు గట్టిగా వినబడుతున్నాయి. అలాగే సిసిఎల్ చైర్మన్గా నవీన్ మెటల్ ఐఏఎస్ ను అత్యంత అవినీతిపరుడుగా ప్రతిపక్షంలో కూర్చున్న ఇదే రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా చూపించిన అప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న తరువాత కూడా అదే ఐఏఎస్ ఆఫీసర్ ను ధరణికి ప్రత్యేక అధికారిగా పూర్తి అధికారాలను కట్టబెట్టడం ఏంటి అనే ప్రశ్న కూడా ఉత్తన్నమవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న అత్యంత అవినీతి పరులు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం లోనే ఉండి తమ పనులు తామే చక్కబెట్టుకుంటూ ఇంకా కేసీఆర్ ప్రభుత్వం లోనే ఉన్నాం అనే ఆలోచనలతో పనిచేస్తున్నారు అనే ఆరోపణలు గట్టిగా వినపడుతున్నాయి... ఇక ఇవన్నీ మీటింగులతో రాజకీయ నాయకుల మాటలు ఆకాశాన్ని అంటుతుంటే.
ఇంకోవైపు తెలంగాణ మంత్రులు ఒకే హెలికాప్టర్లో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లడం అక్కడ స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడం ఆ తరువాత వరుస సంఖ్యలో కూర్చున్న సీట్లలో కొంత తేడా వచ్చి ఉపముఖ్యమంత్రి కింద కూర్చోవడం ఒక వైపు సోషల్ మీడియాలో ఈ విషయం రాద్ధాంతం చేస్తున్న నేపథ్యంలో మరో కొత్త వాదన పుట్టుకొస్తుంది.... ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రాబోయే రోజుల్లో తెలంగాణ సీఎం గా కనిపిస్తాడా అనే సంకేతాలు తెరచాటు రాజకీయాలు గుట్టు బయట పడుతుంది... రెండున్నర సంవత్సరాలు రేవంత్ రెడ్డి రెండున్నర సంవత్సరాలు బట్టి విక్రమార్క తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడానికి తర్జనభర్జనలు చేసుకొని చివరికి ఏఐసీసీ ప్రెసిడెంట్ కరిగే చెప్పడం ద్వారా ఇద్దరి నేతల ఒప్పందం మేరకు మొదలు రెండున్నర సంవత్సరాలు రేవంత్ రెడ్డి అధికారం చలాయిస్తున్నాడు అని మిగతా రెండున్నర సంవత్సరాలు కచ్చితంగా బట్టి విక్రమార్క తెలంగాణ ముఖ్యమంత్రిగా కనిపిస్తారని రాజకీయ ఊహాగానాలు తెలంగాణ రాష్ట్రంలో అంతర్గతంగా గుసగుసలు జరుగుతున్నాయి... ఎందుకంటే ఒక దళితుడిని అవమానించారు అన్న సంకేతాలు సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్న ఆయా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం లేదు లేదు మేష రాజకీయాలకు తెరలేపుతుంది టిఆర్ఎస్ ప్రభుత్వం అంటూ వాదన చేస్తున్న ఇంకో వైపు సీఎల్పీ లీడర్గా దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో పని చేసిన మినిస్టర్గా బట్టి విక్రమార్క పాదయాత్ర ద్వారా పార్టీ పెద్దల మన్ననలను పొందుకున్నాడు.
అనూహ్యంగా రేవంత్ రెడ్డి రాష్ట్ర పీసీసీ అధ్యక్షునిగా కావడం ఉన్నఫలంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కావాలి అని ఒక రాజకీయ వాదన బలం పుంజుకుంటుంది... ఎందుకంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్ పరిధిలో అధికార వర్గాల్లో పూర్తిగా రెడ్డి సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోవైపు పేరుకే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క ఆయన రాజకీయ భవిష్యత్తు అద్దంలో చూసుకుంటున్నట్టుగానే అధికారాలు చెలాయిస్తున్న ఇంకోవైపు ఆయన వర్గానికి సంబంధించిన పార్టీ నేతలు పెద్దలు అభిమానులు కార్యకర్తలు మా బట్టి ముఖ్యమంత్రి కావాలి అనే వాదన లేకపోలేదు... మొత్తానికి కాంగ్రెస్ లో అంతర్గత పోరు ఉన్న పైకి మాత్రం గాంభీర్యంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరు చూస్తుంటే ప్రజల మద్దతు రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా కనిపిస్తోంది.
మొత్తానికి పార్లమెంటు ఎలక్షన్ల పుణ్యమా అని వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ చేసుకునే పెద్దలు ఇలాంటివారు ఎప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుందో అని గుండె ను అదిమి పట్టుకొని చకచగా పనులు చేసుకుంటున్న ఈ తరుణంలో ఒకవైపు బిజెపి ఇంకోవైపు బీఆర్ఎస్ రెండు పార్టీలతో పాటు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్లు తెలంగాణలో మూడు పార్టీల రాజకీయ మీటింగులతో రాష్ట్ర అట్టుడికి పోయింది.. ప్రజలు అన్ని మీటింగ్లు వింటున్నారు అందరి ప్రసంగాలు వింటున్నారు కానీ పార్లమెంటు ఎన్నికల్లో ఏ విధంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారో ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ది టైమ్స్ ఈ టి జి అనే రాజకీయ సర్వే చేసిన ప్రకారంగా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ 12 నుంచి 15 సీట్లు పొందుకునే అవకాశం ఉందనే సంకేతాలు విడుదల చేశాయి... ఇక బిజెపి టిఆర్ఎస్ కు ఎన్ని సీట్లు వస్తాయో ప్రజలే నిర్ణయించాలి.... ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణీతలు కాబట్టి వారి అభిప్రాయం మేరకే ప్రజాస్వామ్యం మనుగడ పరిడ విల్లుతోంది.
...కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
Post Comment