ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలి...
పర్వతాపూర్ మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు పంపిణీ... మేయర్ జక్క వెంకట్ రెడ్డి
విద్యార్థి దశలోనే భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉన్నత చదువులు చదువుకొని లక్ష్యాన్ని సాధించాలని విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించేలా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని చెప్పారు.
జయభేరి, మేడిపల్లి :
ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్ మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాల నందు విద్యార్థిని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... విద్యార్థి దశలోనే భవిష్యత్తు ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉన్నత చదువులు చదువుకొని లక్ష్యాన్ని సాధించాలని విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంపొందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించేలా ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని చెప్పారు. పాఠశాల అభివృద్ధికి దాతల సహకారంతో పాటు నగర పాలక సంస్థ ప్రత్యేక నిధులు కేటాయించి కిచెన్ షెడ్,ప్రహరీ గోడ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా,మరుగుదొడ్లు మొదలైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.

విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడానికి అవసరమైతే విద్యా వాలంటీర్లను నియమించడానికి పూర్తి సహాయ సహాకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బోడిగే స్వాతి కృష్ణ గౌడ్, కొల్తూరి మహేష్, బచ్చ రాజు,కౌడే పోచయ్య, మధుసూదన్ రెడ్డి,కో ఆప్షన్ జగదీశ్వర్ రెడ్డి, నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, బండి సతీష్ గౌడ్,జావీద్ ఖాన్,యాసారం మహేష్, శ్రీనివాస్,కిరణ్ కుమార్, వెంకన్న, జోగి రెడ్డి, శంకర్ రావు,తదితరులు పాల్గొన్నారు.



