ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 

సమాచార హక్కు చట్టం రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్

ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 

జయభేరి, దేవరకొండ :
రాష్ట్రములో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2(హెచ్) ప్రకారం అధికార యంత్రంగం సూచిక బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అందులో పౌర సమాచార అధికారుల పేర్లు మార్పులు-చేర్పులు ఎప్పటికప్పుడు నమోదు చేయాలి.రాష్ట్రములో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 4(1)బి ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో 17 అంశాల స్వచ్చంద సమాచారం వెల్లడించేలా చేయాలి. రాష్ట్రములో వున్నా జిల్లాలో స.హ. చట్టం 2005 ఆర్ టీ ఐ జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయాలి. 

ఈ కమిటీలో ఇద్దరు ఆర్ టీ ఐ కార్యకర్తలను సభ్యులుగా నియమించాలి. రాష్ట్రములో గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు గల అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు స.హ చట్టం 2005 పై 3 నెలలకు ఒకసారి శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని స.హ. చట్టం రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు కొర్ర. కిషన్ నాయక్ తెలిపారు.సలహాలు సూచనలు కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9885122005.

Read More సెల్లార్ లో కూలిన మట్టిదిబ్బలు