అద్రాస్ పల్లిలో ఈత వనాల పరిశీలన
గీత కార్మికులను ఇబ్బందులు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి - సాయిలు గౌడ్
జయభేరి, సెప్టెంబర్ 16:- కల్లుగీత కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గీత పనివారల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిజి సాయిలుగౌడ్ డిమాండ్ చేశారు.
గత మూడు సంవత్సరాలుగా ఈ భూమిలో బోర్లు వేసి డ్రిప్ ఇరిగేషన్ ద్వార నీటిని సరఫరా చేస్తు చెట్లను పెంచుతున్నట్లు, అయితే అందులో పదిహేను తాటి చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు ద్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విదంగా 560 జీవో ప్రకారం ఈతవనాల పెంపకానికి 10 ఎకరాలు భూమిని కేటాయించాలని రాష్ట్ర సంఘం తరపున ఎన్నో మార్లు రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులకు జిల్లా కలెక్టర్ కు వినతులు చేశామని విన్నవించమన్నారు.
అద్రాస్ పల్లిలో ప్రభుత్వ భూమి 20 ఎకరాలు ఉంటుందని అందులోనే గీత కార్మికులు ఎక్సైజ్ అధికారుల ఆదేశాల మేరకు చెట్ల పెంపకం చేస్తున్నుట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో ఆర్డినేటింగ్ జనరల్ సెక్రటరి నాగభూషణం, గీత పనివారల సంఘం ప్రధాన కార్యదర్శి యాదయ్యగౌడ్, జిల్లా కార్యదర్శి డిజి నరేంద్రప్రసాద్, గ్రామ అధ్యక్షుడు నాగేష్ గౌడ్, వీరస్వామిగౌడ్, వెంకటేష్ గౌడ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Post Comment