NEXT MONTH - KCR : వచ్చే నెలలో కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు

రైతుల సమస్యలను పరిశీలించేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించాలని నిర్ణయించారు

NEXT MONTH - KCR : వచ్చే నెలలో కేసీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు

హైదరాబాద్ :

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజా సమస్యలను ప్రచార సామాగ్రిగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ ఎస్ పార్టీ భావిస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. మరోవైపు కరెంటు లేకపోవడం, నీటి ఎద్దడితో ఎండిపోతున్న పంటలు వంటి ప్రధాన అంశాలను ప్రచారంలో లేవనెత్తే పనిలో పడింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిశీలించేందుకు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించాలని నిర్ణయించారు. ఏప్రిల్ మొదటి వారంలో ఆయన పర్యటన ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. రైతులు బోర్లు వేసిన నల్గొండ జిల్లా ముషంపల్లి గ్రామంతో పాటు ఆలేరు నియోజకవర్గం నుంచి కేసీఆర్ తన పర్యటనను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. నల్గొండ, భువనగిరి జిల్లాల్లో పంట నష్టంతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు గ్రామాలతో సహా రూట్ మ్యాప్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు సైతం ఎండిపోయిన పంటలను పరిశీలించేందుకు రావాల్సిందిగా కేసీఆర్ ను కోరినట్లు సమాచారం.

Read More శ్రీ గౌరీ అవతారంలో అమ్మవారు 

kcr22

Read More ఐయన్టీయుసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మొగుళ్ల రాజి రెడ్డి నియామకం.

కాగా, మంగళవారం నుంచి మూడు రోజుల పాటు బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు తమ పరిధిలోని గ్రామాల్లో పంట నష్టం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రస్తుత పంటల పరిస్థితిని పరిశీలించాలని కేసీఆర్ రెండు రోజుల క్రితం సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి నివేదికల రూపంలో పంపాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో బీఆర్ ఎస్ నాయకులు పంటల పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

Read More సౌత్ జోన్ ఈఎన్ టీ సర్జన్ కాన్ఫరెన్స్ ప్రారంభం

kcr-kavya

Read More బోడుప్పల్ 5వ డివిజన్లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

కేసీఆర్‌తో భేటీ కడియం కావ్య 
వరంగల్ లోక్ సభ స్థానానికి తనను ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కడియం కావ్య మంగళవారం ఆయన నివాసంలో కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించాలని కావ్యను కేసీఆర్ ఆశీర్వదించారు.

Read More జి ఎన్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

Latest News

నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి
మహాకవి దాశరథి కృష్ణమాచార్య దాశరథిగా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల...
Reba Monica John
Rashmika Mandanna
Rashi Singh
గోదావరి పుష్కర ఏర్పాట్లు షురూ...
స్మార్ట్ కార్డుల్లో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు