HMDA : పైగా ప్యాలెస్‌లోకి అడుగుపెట్టిన హెచ్‌ఎండీఏ.. అక్కడి నుంచే ఆమ్రపాలి విధులు..!

పైగా ప్యాలెస్‌లో హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయం... లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక క్లోజ్ ఆఫీస్.. ఫర్నీచర్, అధికారుల ఛాంబర్‌లను ఈ నెలాఖరులోగా ఏర్పాటు చేయనున్నారు.

HMDA : పైగా ప్యాలెస్‌లోకి అడుగుపెట్టిన హెచ్‌ఎండీఏ.. అక్కడి నుంచే ఆమ్రపాలి విధులు..!

కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చారిత్రక వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన బేగంపేట ప్యాలెస్‌ను హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించింది. హెచ్‌ఎండీఏ కార్యకలాపాలన్నీ ఒకే చోట నుంచి జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. హెచ్‌ఎండీ కమిషనర్‌ ఆమ్రపాలి ఇక్కడి నుంచే విధులు నిర్వహించనున్నారు.

హైదరాబాద్ నగరంలోని చారిత్రక వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన బేగంపేట ప్యాలెస్‌ను హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంగా మార్చేందుకు ప్రభుత్వ ప్రక్రియ ప్రారంభమైంది. హెచ్‌ఎండీఏ కార్యకలాపాలన్నీ ఒకే చోట నుంచి జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏకు సంబంధించిన పనులు అమీర్‌పేట, నానక్రాంగూడ, హుస్సేన్‌సాగర్ లుంబినీ పార్క్ ప్రాంతాల నుంచి జరుగుతున్నాయి. వీటన్నింటినీ బేగంపేటలోని పైగా ప్యాలెస్‌కు తరలించేందుకు హెచ్‌ఎండీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు చర్యలు చేపట్టారు.

Read More మేడ్చల్ లో కీచక పోలీస్

వారం రోజులుగా అధికారులు ప్యాలెస్‌లోని భవనాలు, ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలిస్తున్నారు. విద్యుత్ శాఖతో పాటు ఐటీ, నెట్ వర్కింగ్ ఉద్యోగులు భవనాల్లోని వనరులను గుర్తించే పనిలో పడ్డారు. దాదాపు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్‌ఎండీఏకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఒకేచోట నుంచి జరిగేలా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు.

Read More ఎగ్లాస్పూర్ ప్రజా పాలన గ్రామసభ కార్యక్రమం

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించి ప్రత్యేక జీవోను జారీ చేయగా, కార్యాలయ నిర్వహణకు అవసరమైన ఫర్నిచర్, వివిధ శాఖల ఉన్నతాధికారుల ఛాంబర్లు, వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలపై అధికారులు ఈ నెలాఖరులోగా నివేదిక సిద్ధం చేయనున్నారు. ఈ భవనం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండడంతో దీన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

Read More యూనియన్ బ్యాంక్ మేనేజర్ పున్న సతీష్ కుమార్ కు బెస్ట్ బ్యాంకర్ అవార్డు 

ఆగస్టు నాటికి హెచ్‌ఎండీఏ కార్యాలయాల తరలింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో.. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ ఆమ్రపాలి అక్కడి నుంచే విధులు నిర్వహించనున్నారు. కేంద్రంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించిన ఆమ్రపాలి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి వచ్చారు. దీంతో.. రేవంత్ సర్కార్ ఆమెను హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా నియమించి మూసీ అభివృద్ధి బాధ్యతలను కూడా ఆమెకు అప్పగించింది.

Read More కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి