BJP : యువత ఆశయాలకు అనుగుణంగా మోదీ సర్కార్‌

ఈటల క్షమిత

BJP : యువత ఆశయాలకు అనుగుణంగా మోదీ సర్కార్‌

జయభేరి, మేడ్చల్ : 

యువత ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా మోదీ సర్కారు ముందుకు సాగుతోందని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కోడలు క్షమిత అన్నారు. శుక్రవారం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో బిజెవైఎం మున్సిపల్ అధ్యక్షుడు బట్టికడి విక్రమ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ చౌపల్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఈటల క్షమిత,  రాష్ట్ర బిజెవైఎం ప్రధాన కార్యదర్శి పవన్ రెడ్డి, కుమార్ యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్న యువ ఓటర్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న నీతివంతమైన పాలనకు మద్దతుగా బీజేపీకి మద్దతుగా నిలవాలని కోరారు. ప్రధాని మోదీ వివిధ రంగాలలో అద్భుత మైన మైలురాళ్లను అధిగమిస్తూ యువత బంగారు భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తున్నారని అన్నారు. దేశ అభివృద్ధి కోసం యువత నడుం బిగించాలని సూచించారు. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ, కశ్మీరులో ఆర్టికల్‌ 370 రద్దు, కరోనా సమయంలో ఉచిత వ్యాక్సిన్‌, ఇలా చెప్పుకుంటూ పోతే నరేంద్రమోదీ దేశం కోసం ఎంతో చేశారని వివరించారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తున్నాయని అన్నారు. దేశ ఆర్థిక స్థితి 10వ స్థానం నుంచి మూడో స్థానానికి వచ్చామని, 2047 కల్లా ప్రపంచంలోని అభివృద్ధి దేశాలతో పాటు మన దేశం కూడా ముందు వరసలో ఉంటుందని చెప్పారు.

Read More ముస్లిం లందరికీ ఇఫ్తార్ విందు

ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవుతారని, కొత్త ఓటరైనా మీ మొదటి ఓటును పార్లమెంటు ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు ఉషిగారి శ్రీనివాస్, జిల్లా బిజెవైఎం అధికార ప్రతినిధి కావేరి శ్రీధర్, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి సుంకు నవీన్, ఉపాధ్యక్షుడు పిట్ల అశోక్, సుంకరి శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, వినయ్, అరవింద్, శివ, అభి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Read More బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి మంత్రి పొన్నం ప్రభాకర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు

Latest News

BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!! BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!!
జయభేరి, హైదరాబాద్‌, జూన్‌ 18 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ఇంతవరకు జరిగిన కృషిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ను...
కాళేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపి, కేసీఆర్‌ ని వ్యక్తిగతంగా బద్నాం చేయాలనే కాంగ్రెస్ కుట్రలు
KavyaKalyanram : అందమే అసూయపడేలా కనువిందు
Air India Flight Crashed : అంతులేని విషాదం వెనుక
Pooja Hegde
Deepika pilli