Holi | Revanth Reddy : హోళీ నాడు… మనుమడితో ఆటవిడుపు...

మనవడితో కలిసి సీఎం హోలీ సంబురాలు... వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి ఫోటోలు

Holi | Revanth Reddy : హోళీ నాడు…  మనుమడితో ఆటవిడుపు...

సీఎం రేవంత్ రెడ్డి: నిత్యం పరిపాలనలో బిజీగా ఉండే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోలీ పండుగను ఆనందంగా జరుపుకున్నారు. పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలు కాకుండా మనవడితో కలిసి సీఎం హోలీ జరుపుకున్నారు. నిత్యం పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉండే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోలీ పండుగను ఆనందంగా జరుపుకున్నారు. పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలు కాకుండా మనవడితో కలిసి సీఎం హోలీ జరుపుకున్నారు. హోలీ పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి తన మనవడు రేయన్స్ రెడ్డి, ఆయన భార్య గీతారెడ్డితో కలసి రంగుల వర్షం కురిపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒడిలో కూర్చుని రంగులు చల్లుకుంటున్న పాప ముఖంలో చిరునవ్వు చూసి చలించిపోయారు. దేశవ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లో కూడా యువత, పిల్లలు, పెద్దలు ఎక్కడికక్కడ హోలీని చాలా సంతోషంగా జరుపుకున్నారు. రోడ్లపై రంగులతో హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

cm holi4

Read More గాంధీభవన్ లో జరిగిన టిపిసిసి సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ల సమావేశం

అందరితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు కూడా మనవడితో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నైమిషా రెడ్డి ఒక్కగానొక్క కూతురు. ఆమె కూతురు రేయన్స్ రెడ్డి. రేవంత్ రెడ్డి మనవడికి అతని తల్లిదండ్రులు రేయాన్స్ అని పేరు పెట్టారు. తన తాత (రేవంత్ రెడ్డి) పేరులోని మొదటి అక్షరంతో రాయన్స్ అని పేరు పెట్టారు. అయితే బాబుకు తల్లిదండ్రులు రాయన్స్ అని పేరు పెట్టగా, సీఎం రేవంత్ రెడ్డి మనవడు రుద్రదేవ్ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా గతంలో ఒకసారి చెప్పారు. రేవంత్ రెడ్డికి రాయన్స్ (రుద్రదేవ్) అంటే ఇష్టమే కాదు సెంటిమెంట్ కూడా. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి కొడంగల్ లో తొలిసారిగా ప్రచారం చేసినప్పుడు మనవడిని తీసుకుని తన కాన్వాయ్ లో ప్రజల్లోకి వెళ్లారు. బాబు పుట్టిన సమయంలో ఉయ్యాలలో ఉన్న ఫొటోను చూపించి తనకు మనవడు ఉన్నాడని అభిమానులతో సీఎం ఆనందాన్ని పంచుకున్నారు. రేయన్స్ ఏప్రిల్ 9న రేవంత్ రెడ్డి కుమార్తె నైమీషా రెడ్డికి జన్మించారు.

Read More సౌత్ జోన్ ఈఎన్ టీ సర్జన్ కాన్ఫరెన్స్ ప్రారంభం

ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో అప్పట్లో పంచుకున్నారు. ఈ సందర్భంగా మనవడితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మనవడు రేయాన్స్‌ ముఖకవళికలు, చిరునవ్వుతో కూడిన ముఖాలు కూడా తాత రేవంత్‌రెడ్డి తరహాలోనే ఉండడంతో ఆయన అభిమానులు, అనుచరులు సంబరాలు చేసుకుంటున్నారు. మనవడితో కలిసి హోలీ జరుపుకుంటున్న ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2015లో వ్యాపారవేత్త సత్యనారాయణ రెడ్డితో నైమీషా వివాహం జరిగింది. ఒక్కతే కూతురు కావడంతో నైమీషా పెళ్లిని రేవంత్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. మనవడితో కలిసి హోలీ జరుపుకున్న ఫొటోలను సీఎం స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

Read More రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ పోటీలకు ఎంపికైన తుంకుంట పాఠశాల విద్యార్థులు 

Latest News

నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి
మహాకవి దాశరథి కృష్ణమాచార్య దాశరథిగా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల...
Reba Monica John
Rashmika Mandanna
Rashi Singh
గోదావరి పుష్కర ఏర్పాట్లు షురూ...
స్మార్ట్ కార్డుల్లో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు