వాసవి కళ్యాణ మండపంలో  ఘనంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ వేడుకలు

వాసవి కళ్యాణ మండపంలో  ఘనంగా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ వేడుకలు

దేవరకొండ : దేవరకొండ పట్టణంలోని శ్రీవాసవి కళ్యాణ మండపంలో ఆదివారం అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

ఈ సందర్భంగా వాసవి క్లబ్, మరియు వాసవి వనిత క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ మంచి స్నేహితుల సాహిత్యం దొరికితే జీవితంలో ఉన్నత లక్ష్యాలను ఛేదించవచ్చని, జీవితాన్ని ఉత్తమంగా ఆస్వాదించవచ్చని చెప్పారు. మేమందరం ఈ స్థాయికి ఎదగడంలో తన స్నేహితుల సలహాలు,సూచనలు,ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు.ఫ్రెండ్షిప్ అనేది ఒక ఎమోషనల్ ఫీలింగ్ అని,మంచి స్నేహితులు ఉన్నవారు జీవితంలో ఉన్నతంగా ఉంటారని,ఉత్తమ జీవితం గడుపుతారని అన్నారు. మంచి స్నేహితులు ఉంటే ఏ ఒత్తిడి మన తరిచేరదని, అందుకే నేటి యువత మంచి స్నేహితులను సంపాదించుకోవాలని, జీవితాన్ని సఫలంగా ఆనందంగా గడపాలని తెలిపారు.జీవితంలో మంచి స్నేహితులు దొరకడం కష్టమని, అలాంటి వారిని చేజార్చుకోకుండా ఉండటమే స్నేహితులకిచ్చే నిజమైన విలువ అని అన్నారు.

Read More పరకాల ఏజీపీగా లక్కం శంకర్

ఈ సృష్టిలో శాశ్వతంగా నిలిచిపోయే బంధమంటే అది స్నేహ బంధమే అని,ఆస్తిపాస్తులతో సంబంధం పనిలేకుండా, చూసుకోకుండా, నిస్వార్థంతో వ్యవహరించే అనురాగ బంధం స్నేహామని అన్నారు. డబ్బులను సంపాదించుకోవచ్చు గాని స్నేహితులను సంపాదించుకోవడం దేవుడిచ్చిన వరమని అధ్యక్షురాలు తొణుకునూరు విజయ అన్నారు స్నేహితుల దినోత్సవ సందర్భంగా పూర్వ అధ్యక్షులను సన్మానం చేసినారు 
 ఈ సన్మాన కార్యక్రమంలో  ఐపిసి బెలీదేమాధవి, గోవిందు పద్మ ,గోవిందు ఝాన్సీ, కర్నాటి జ్యోతి ,జోన్ చైర్మన్ ఆలంపల్లి పద్మ, కొత్త సావిత్రి , చీదల్ల శ్రీదేవి ,పందిరి శ్రీదేవి, గార్లపాటి రజిని, గుడుగుంట్ల హేమలత ,స్వప్న, లకుమారపు సుకన్య, ఆతుకూరి రమాదేవి, గోవిందు పద్మజ, నీల పద్మ, సన్మానించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని వాసవి వనిత క్లబ్ అధ్యక్షులు తొణుకునూరి విజయ కార్యదర్శి మంచి కంటి పద్మ, కోశాధికారి కుంచకూరి శిరీష ఆధ్వర్యంలో నిర్వహించారు.

Read More వంద పడకల ఆసుపత్రి ప్రారంభానికి మోక్షం ఎప్పుడో ?

ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు నీల బిక్షమయ్య, సెక్రటరీ ఆతుకూరి ఆంజనేయులు, కండే సత్యం, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చీదేళ్ల వెంకటేశ్వర్లు వాసవి కళ్యాణ మండపం అధ్యక్షులు వాస వెంకటేశ్వర్లు సముద్రాల ప్రభాకర్ కొత్త సుబ్బారావు గుద్దేటి జంగయ్య ఎచ్చా చంద్రయ్య వాసవి క్లబ్ జిల్లా ఇన్చార్జ్ లకుమారపు మల్లయ్య అర్థం రమేష్ తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్ సభ్యులు మరియు వాసవి వనిత క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Read More ఈనెల 25న జరిగే రవీంద్ర భారతిలో బీసీల సమరభేరిని విజయవంతం చేయండి

Latest News

ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి  ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
జయభేరి, దేవరకొండ :రాష్ట్రములో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2(హెచ్) ప్రకారం అధికార యంత్రంగం సూచిక బోర్డులను తప్పనిసరిగా...
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్ 
ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికే పెద్ద పీఠ 
విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి