పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి:- కౌన్సిలర్ మల్లికార్జున్

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి:- కౌన్సిలర్ మల్లికార్జున్

జయభేరి, మేడ్చల్ :

పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని, మొక్కలను నాటి వాటిని సంరక్షించినప్పుడే భావితరాలకు కాలుష్యరహిత సమాజాన్ని అందించగలమని కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా గుండ్లపోచంపల్లిలో విద్యుత్ ఏఈ వెంకటేష్ గౌడ్ తో కలిసి మొక్కలు నాటారు.

Read More Telangan I ఏదీ రాజ్యాంగ స్ఫూర్తి.. సందేహమా? సవాళ్ల?

అనంతరం కౌన్సిలర్ మల్లికార్జున్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. చెట్లను పెంచడం ద్వారా భావితరాలకు కాలుష్యరాహిత సమాజాన్ని అందిగలమన్నారు. స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుకు మొక్కలు నాటి కాపాడుకోవాలన్నారు. ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ అహ్లాదకరమైన వాతావరణం ఉంటుందన్నారు. ప్రకృతి మనకు ఎంత ముఖ్యమైనదని, ప్రకృతి తరువాతనే జీవకోటి భూమిపైకి వచ్చిందన్న విషయాన్ని చరిత్ర చెప్పిన సత్యమని అన్నారు. భూ మండలంపై పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు చెట్లు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.

Read More Congress I రగులుతున్న రాజకీయం.. మంట పెట్టే వారెవరు!?

Views: 0