ప్రాణదాతలుగా నిలుస్తున్న డాక్టర్లు  ... మానవతా దృక్పథంతో సేవలందిస్తున్న పలువురు డాక్టర్లు 

ప్రాణదాతలుగా నిలుస్తున్న డాక్టర్లు   ... మానవతా దృక్పథంతో సేవలందిస్తున్న పలువురు డాక్టర్లు 

దేవరకొండ.

వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని, వైద్యులు దైవం లాంటి వారని, సమాజంలో వైద్యుల పాత్ర కీలకమైందని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డాక్టర్ శంకర్ నాయక్ విజయ దంపతులకు శాలువలతో ఘనంగా సత్కరించారు. వీరితోపాటు బంజారా సంఘం నాయకులు పాపా నాయక్, లక్ష్మానాయక్,లక్పతి నాయక్, మరియు దేవరకొండ లయన్స్ క్లబ్ మిత్ర సభ్యులు కృష్ణమాచారి, అంకం చంద్రమౌళి, మాకం మహేష్ లు పూలమాలలతో సత్కరించి వైద్యుల ప్రాముఖ్యతను తెలిపారు.

Read More మోటార్ సైకిల్ దొంగలించిన నిందితుడు అరెస్టు 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యులు ప్రత్యక్ష దైవాలు అని, సమాజంలో వైద్యుల పాత్ర కీలకమైందని, వైద్యుల రంగాన్ని మరింత పటిష్టం చేయాలని అన్నారు. మన ప్రాణాన్ని కాపాడడానికి అహర్నిశలు పనిచేసే వైద్యుల సేవలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో వైద్యులు అందించిన సేవలు గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొన్నారు.

Read More మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు