Congress I అధికార బలంతో ఇష్టానుసారంగా కబ్జాలకు పాల్పడ్డారని ఆగ్రహం
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని సవాల్... మాజీమంత్రి మల్లారెడ్డిపై నిప్పులు చెరిగిన మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్
జయభేరి :
పది సంవత్సరాలు పదవిలో ఉండి కూడా మేడ్చల్ కి ఒక డిగ్రీ కాలేజ్ తేలేకపోయావు మల్లారెడ్డి ఒకవైపు ఆయన కుటుంబ సభ్యులు మరోవైపు మేడ్చల్ నియోజకవర్గాన్ని దోచుకుని దర్జాగా అవినీతి సొమ్ముతో జల్సాలు చేస్తున్నారని వండిపడ్డారు. నీలాగా మేము అక్రమాలు చేయలేద ని నిజాయితీగా ప్రజలకు సేవ చేసామని ఆయన అన్నారు. మల్లారెడ్డి అనుచరుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని నామినేట్ పదవుల్లో నాయకులు మొదలుకొని ప్రత్యక్ష రాజకీయాల్లో గెలుపొందిన సర్పంచులు , ఎంపీటీసీలు, చైర్మన్లు , మేయర్లు కోట్ల రూపాయలు అవినీతిని చేశారని వాపోయారు. అధికారం పోగానే అందరికీ కాళ్లు పట్టుకుని మళ్లీ అధికారిక పార్టీలోకి రావడానికి ఎత్తులు వేస్తున్నాడని అన్నారు. తన కళాశాలకు విద్యార్థులతో సుమారుగా 50 వేల ఓట్లు దొంగ ఓట్లు తయారు చేసుకుని ఎమ్మెల్యేగా గెలిచాడని ప్రజలు వేసిన ఓట్లతో గెలవలేదని ఎద్దేవ చేశారు. దమ్ముంటే మేడ్చల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఇప్పుడు గెలవమని సవాల్ విసిరారు. నేడు మేడ్చల్ నియోజకవర్గం నాయకుల సమావేశం ( ఆదివారం) తూముకుంట లోని మొగుళ్ళ వెంకట్రెడ్డి ఫంక్షన్ హాల్లోని మేడ్చల్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందని చెప్పారు. ఈ సమావేశానికి తుమ్మల నాగేశ్వరరావు, మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు విచ్చేస్తారని చెప్పారు. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు. ఏ కులం పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకున్నారు.
Post Comment