Revanth : రేవంత్ రెడ్డివి అన్నీ తాల్ బోల్ మాటలు
సోయిలేకుండా హామీలు ఇచ్చారు.. డిక్లరేషన్లు మాటలకే పరిమితం అయ్యాయి.. కల్యాణలక్ష్మి పిల్లలు పుట్టాక వస్తుంది...
ఇప్పుడు లంకెబిందెలు ఉన్నాయని వచ్చా.. ఉత్త బిందెలే ఉన్నాయి అని రేవంత్ అంటున్నారు.. కాంగ్రెస్ కి వచ్చే 40 సీట్లతో రాహుల్ ఎలా ప్రధాని అవుతారు. వచ్చేది సచ్చేది లేదు. ఈటల రాజేందర్, మల్కాజ్ గిరి మినీ ఇండియా. ఇతర రాష్ట్రాల వారే కాకుండా.. తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల వారు ఇక్కడ ఉంటారు. ఆలోచనాపరులలని బీజేపీ పార్లమెంట్ అభ్యర్ది ఈటల రాజేందర్ అన్నారు.
సోయి ఉండి హామీలు ఇచ్చారా ?
ఇప్పుడు లంకెబిందెలు ఉన్నాయని వచ్చా.. ఉత్త బిందెలే ఉన్నాయి అని రేవంత్ అంటున్నారు. తెలంగాణ వచ్చిన నాడు మద్యం ఆదాయం 10,700 కోట్లు.. ఈనాడు అది 45 వేల కోట్లు. ఈ ఆదాయం కోసం ఎంతో మంది మహిళల పుస్తెల తాళ్ళు తెగిపడ్డాయి. అయినా ఆ ఆదాయం వస్తేనే జీతాలు, పెన్షన్లు వస్తున్నాయి. ఇలాంటి రాష్ట్రంలో ఇన్ని హామీలు ఇచ్చారు. ఒక్క ఫ్రీ బస్ తప్ప ఏ హామీ అమలు కావడం లేదు. మళ్లీ ఇప్పుడు వచ్చి 17 ఎంపీ సీట్లు గెలిపిస్తే హామీలు అన్నీ అమలు చేస్తా అని అంటున్నారు. మనం ఏమన్నా పిచ్చోళ్ళల కనిపిస్తున్నామా ?
40 సీట్లు వచ్చే రాహుల్ ఎలా ప్రధాని అవుతారు. వచ్చేది సచ్చేది లేదు. మోదీ ఏనాడు అబద్ధపు వాగ్దానాలు ఇవ్వలేదు.
370 రద్దు చేస్తాం అన్నారు. కాశ్మీరు ను భారత్ లో అంతర్భాగం చేశారు. 500 ఏళ్ళ నాటి కలను సాకారం చేసి.. అయోధ్య రామమందిరం నిర్మాణం చేసి భారతజాతికి అంకితం చేశారు. భారత ఆత్మగౌరవం బావుటా ఎగురవేసిన బిడ్డ మోదీ . సుబిక్ష సుసంపన్న భారత దేశం కోసం మళ్లీ ప్రధాని కావాలని దేశ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మల్కాజిగిరి ప్రజల ప్రేమకు ముద్గుడైన ప్రధాని. ఆప్ జరూర్ జీతేగా జీత్ కే ఆవో అని చెప్పారు. ఇది కొత్తగా ఏర్పడ్డ సిటీ.. ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇలా అనేక సమస్యలు ఉన్నాయి వాటిని తీర్చడానికి నాకు అవకాశం ఇవ్వమని కోరుతున్నాను. మీకోసం మోదీ దగ్గర నుండి నిధులు తీసుకువస్త. రేవంత్ ఇచ్చిన హామీల అమలకు కొట్లడతా.
రెండు భాద్యతలు నిర్వహిస్తా. నేను మీకు మచ్చ తెను. నేను అనుభవించిన బాధ ఈనాడు పిల్లలు అనుభవించ వద్దు అని మొదటి ఆర్థిక మంత్రిగా సన్నబియ్యం పథకం తెచ్చింది నేను. హైదరాబాద్ లో హాస్టల్స్ ఉండడం వల్ల ఆ కులాల్లో ఉన్న పిల్లలు పెద్ద చదువులు చదువుకున్నారు. ఆ ఉద్దేశ్యంతోనే 72 కులాలకు హాస్టల్ భవనాలు మంజూరు చేశాం. వారికి హైదరాబాద్ లో ఒక అడ్డా ఉండాలి అని ఈ భావనలు ఇచ్చాం. 40 రోజులు అసెంబ్లీలో మీటింగ్ పెట్టీ బీసీ కులాల సమస్యలు తెలుసుకున్నాం. అందులో భాగమే కుల సంఘాల భవనాలు, 250 రెసిడెన్షియల్ స్కూల్స్. కరోనా పేషంట్ దగ్గరికి వెళ్ళిన మొదటి మంత్రిని నేను. మల్కాజిగిరి అభివృద్ధి కోసం, ఈ ప్రజల ఆత్మగౌరవం కోసం, రేపటి రాష్ట్ర భవిష్యత్తు కోసం నన్ను ఆశీర్వదించండి అని కోరుతున్నాను.
Post Comment