స్వస్థ నగరం నమూనా కార్యక్రమ అమలుపై సమీక్ష
జయభేరి, మేడిపల్లి : టీబీ విముక్త మున్సిపాలిటీల ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కలిసి చేపట్టిన 'స్వస్థ నగరం' నమూనా కార్యక్రమం అమలుపై మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో సమావేశం జరిగింది.
టీబీ వ్యాప్తిని మూడింట ఒక వంతుకు తగ్గించడం, టీబీ సంబంధ కారణాలతో మరణాలను, వ్యాధి బాధితులు చికిత్స కోసం వెచ్చించే ఖర్చును తగ్గించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యాలు. మూడేళ్ల పాటు పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లు, పోచారం మున్సిపాలిటీలో ఈ నమూనా కార్యక్రమం అమలు చేస్తారు. టీబీ వ్యాధి పెరగడానికి సామాజిక అంశాలు ప్రధానంగా ప్రభావం చూపే పట్టణ ప్రాంతాల్లో దీనిని నిర్మూలించడానికి, టీబీ విముక్త మున్సిపాలిటీలుగా మార్చడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.
Post Comment